NTV Telugu Site icon

Faria Abdullah : ”జాతి రత్నాలు” సీక్వెల్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన చిట్టి..?

Whatsapp Image 2024 04 28 At 8.04.25 Am

Whatsapp Image 2024 04 28 At 8.04.25 Am

టాలీవుడ్ క్యూట్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తన యాక్టింగ్ తో ప్రేక్షకులలో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది .”జాతి రత్నాలు” సినిమాతో ఫరియా అబ్దుల్లా టాలీవుడ్ కి పరిచయం అయింది.ఈ సినిమాలో చిట్టి పాత్రలో ఫరియా అద్భుతంగా నటించింది .తాను చేసిన చిట్టి పాత్ర ఆమెకు బీభత్సమైన పాపులారిటీ తెచ్చిపెట్టింది.దీనితో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.జాతి రత్నాలు మూవీతో వరుస ఆఫర్స్ అందుకొని వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ భామ తాజాగా మరో కామెడీ సినిమాతో అలరించేందుకు ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ఫరియా అబ్దుల్లా నటించిన లేటెస్ట్ మూవీ “ఆ ఒక్కటి అడక్కు”.ఈ సినిమాలో కామెడీ స్టార్ అల్లరి నరేష్ హీరోగా నటించారు.ఈ మూవీ మే 3న రిలీజ్ కానుంది .ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్‌లో జోరుగా పాల్గొంటుంది

ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ ఒక్కటి అడక్కు సినిమాతోపాటు జాతి రత్నాలు 2 మూవీపై అప్డేట్ ఇచ్చింది చిట్టి. దీంతో ఫరియా అబ్దుల్లా కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. “ఆ ఒక్కటి అడక్కు” సినిమాలో సిద్ది అనే పాత్రలో నటిస్తున్నట్లు ఆమె తెలిపింది.ఈ చిత్ర కథ పెళ్లి అనే అంశం చుట్టూ తిరుగుతూ ప్రేక్షకుల అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది.ప్రస్తుతం “జాతి రత్నాలు” మూవీ నిర్మాతలు “కల్కి 2898 ఏడి ” సినిమాతో బిజీగా ఉన్నారు. అది చాలా పెద్ద సినిమా అని దాని కోసం తాను ఎదురుచూస్తున్నట్లు ఆమె తెలిపింది. కల్కి విడుదల తర్వాత జాతిరత్నాలు 2 మూవీ చేసే అవకాశం ఉన్నట్లు ఫరియా అబ్దుల్లా తెలిపింది .

Show comments