సాధారణంగా ఏ స్టార్ హీరో, హీరోయిన్ సినిమాకైనా ప్రీమియర్ షోలు అంటే ఎంతో క్రేజ్ ఉంటుంది. ఫ్యాన్స్‌తో పాటు సెలబ్రిటీలు కూడా ఈ షోలకు ఆసక్తిగా హాజరవుతారు. కానీ షారుక్ ఖాన్, దీపిక పదుకొణె హీరోహీరోయిన్లుగా నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ ప్రీమియర్‌లో మాత్రం పూర్తి భిన్నమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ సినిమా దర్శకురాలు ఫరాఖాన్ స్వయంగా ఈ విషయాన్ని రివీల్ చేస్తూ, అందరినీ ఆశ్చర్యపరిచారు.
Also Read : Hansika : విడాకుల పుకార్లపై స్పందించిన హీరోయిన్ హన్సిక భర్త సోహైల్..
ఫరా మాట్లాడుతూ.. ‘మేము వరుసగా 40 రోజులు ఇండియాలో, మరో 20 రోజులు విదేశాల్లో ప్రమోషన్లతో బిజీగా ఉన్నాం. ప్రమోషన్ టూర్‌లో బాగా అలిసిపోయాం. దుబాయ్‌లో గ్రాండ్‌గా ప్రీమియర్ షో ఏర్పాటు చేశాం. కానీ సినిమాకు వచ్చిన స్టార్స్ అందరూ.. షో స్టార్ట్ అయిన ఐదు నిమిషాల్లోనే నిద్రపోయారు. కుర్చీలో కూర్చోగానే విశ్రాంతిగా అనిపించింది’ అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుండగా, నెటిజన్ల కామెంట్లు కూడా అంతే ఫన్నీగా ఉన్నాయి.. ‘మా వల్ల అయితే ఒక్క క్షణం కూడా మిస్ కాకుండా చూడడమే!’, ‘ఫస్ట్ రోలో షారుక్, దీపిక పక్కన కూర్చునే ఛాన్స్ ఇస్తే నిద్రపడుతుందా?’ అంటూ హ్యూమర్ కామెంట్లతో నెట్టింట ట్రెండ్ అవుతోంది. ‘హ్యాపీ న్యూ ఇయర్’ (2014) సినిమా రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల వరకు వసూలు చేసింది. అప్పట్లో బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ మూవీలలో ఒకటిగా నిలిచింది.
