Site icon NTV Telugu

రోజుకి ఎన్ని సిగరెట్లు ?… రష్మికకు నెటిజన్ ప్రశ్న

Fan Asked about Rashmika Mandanna's daily cigarette count

చాలా తక్కువ సమయంలోనే రష్మిక మందన్న ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బిజీ హీరోయిన్ గా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీకి తాజాగా ఓ నెటిజన్ నుంచి షాకింగ్ ప్రశ్న ఎదురైంది. ఈ నటిని ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అభిమాని “మీరు రోజులో ఎన్ని సిగరెట్లు తాగుతారు?” అని ప్రశ్నించాడు. దానికి స్పందించిన ఆమె ఎప్పుడూ సిగరెట్లు తాగలేదని, సిగరెట్లు తాగేవారు అన్నా తనకు ఇష్టం ఉండరని కూల్ గా రిప్లై ఇచ్చింది.

Read Also : చిక్కుల్లో కార్తీ “ఖైదీ”… స్పందించిన నిర్మాత

కొంతమంది అభిమానులు అల్లు అర్జున్ గురించి చెప్పమని ప్రశ్నించగా ఆయన అద్భుతమైన నటుడని, అతనితో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని వెల్లడించింది. త్వరలో ఓ ప్రాజెక్ట్ లో విజయ్ తో కలిసి పని చేయాలన్న కోరికను రష్మిక వ్యక్తం చేసింది. ఇక రష్మిక హిందీలో సిధార్థ్ మల్హోత్రా సరసన ‘మిషన్ మజ్ను’, అమితాబ్ బచ్చన్, నీనా గుప్తా నటిస్తున్న ‘గుడ్ బై’ చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో ‘పుష్ప’, ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’ చిత్రాలలో నటిస్తోంది.

Exit mobile version