సినీ ప్రపంచంలో అవకాశాలు ఎంత కీలకమో మనకు తెలిసిందే. అప్పటికే రాసిపెట్టిన పాత్రలు, ఊహించని స్టార్స్ చేతిలోకి వెళ్ళిపోతాయి. అలాంటి ఓ ఆసక్తికర సంఘటన ఇప్పుడు ‘కూలీ’ సినిమా లో కూడా జరిగింది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్టు కోసం, ఓ కీలకమైన పాత్రను దర్శకుడు ప్రత్యేకంగా ఆరు నెలల పాటు డిజైన్ చేశారట. ఈ పాత్రకు గుర్తింపు ఉన్న నటుడే అవసరమని భావించిన లోకేష్, మొదట ఫహద్ ఫాసిల్ను సంప్రదించారు. కానీ డేట్స్ క్లాష్ కారణంగా ఫహద్ ఆ ఛాన్స్‌ను వదిలేశాడు.
Also Read : Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మెహర్ రమేష్ కాంబోలో సినిమా
అంతే! ఆ ఛాన్స్ కేరళకు చెందిన మరో ప్రతిభావంతుడు సౌబిన్ షాహిర్ దగ్గరకు చేరింది. రజనీకాంత్ సినిమాలో, అంతటి కీలక పాత్రలో నటించే అవకాశం దక్కేసరికి సౌబిన్ వెంటనే ఓకే చెప్పేశాడు. ఇప్పుడు చూస్తుంటే, ‘మౌనిక..’ అనే పాటలో సౌబిన్ చేసిన ఎనర్జిటిక్ డాన్స్, హీరోయిన్ పూజా హెగ్డేను సైతం డామినేట్ చేస్తూ, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఒక్క పాటే అతనికి భారీ క్రేజ్ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో చూస్తే, ఫహద్ ఫాసిల్‌కి ఇది ఓ తృటిలో తప్పిపోయిన అదృష్టం అని చెప్పవచ్చు. ‘పుష్ప’లో విలన్‌గా, ‘విక్రమ్’లో కీలక పాత్రలో ఆకట్టుకున్న ఫహద్, ‘కూలీ’ వంటి మాస్ సినిమాతో మరో మైలురాయిని మిస్ చేశాడన్నమాట. నిజానికి ఆయన ఇప్పటికే రజినీకాంత్‌తో ‘వెట్టయన్’, అలాగే రాబోయే ‘జైలర్ 2’ వంటి ప్రాజెక్టుల్లో ఉన్నప్పటికీ, లోకేష్ దర్శకత్వంలో మరో ప్రత్యేకమైన పాత్రను కోల్పోయారు. ఈసారి అది ఫహద్ బ్యాడ్ లక్, సౌబిన్ జాక్ పాట్!
