NTV Telugu Site icon

Meenakshi Chaudhary : ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు!

Meenakshi Chaudhary Sad

Meenakshi Chaudhary Sad

సినీనటి మీనాక్షి చౌదరిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. నిజానికి ఈ మధ్యకాలంలోనే మీనాక్షి చౌదరి సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. వరుసహిట్లతో దూసుకుపోతున్న ఈ అమ్మడిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్లు ప్రచారం జరిగింది.

Thandel: ఏడు సముద్రాలు దాటడానికి వస్తున్న తండేల్!

కానీ అది నిజం కాదని ఏపీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే ఫ్యాక్ట్ చెక్ పోర్టల్ నిర్ధారించింది. మీనాక్షి చౌదరిని ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారని సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం పూర్తిగా ఫేక్ అని అందులో పేర్కొన్నారు. ప్రభుత్వం పేరుతో ఉద్దేశపూర్వకంగా ఇలాంటి తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై, ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పలు సోషల్ మీడియా యూజర్లు ఈ మేరకు ఆమెకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంబాసిడర్ గా నియమించింది అంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వమే క్లారిటీ ఇవ్వడంతో ఈ ప్రచారానికి బ్రేకులు పడే అవకాశం ఉంది.