నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. 11 మంది కొత్త హీరోలు, నలుగురు హీరోయిన్స్ ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. నూతన దర్శకుడు ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 9న ఈ చిత్రం విడుదల అవ్వగా. డిఫరెంట్ కంటెంట్‌తో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని సూపర్ కలెక్షన్స్ రాబట్టి బయ్యర్స్ కి మంచి లాభాలు తెచ్చిపెటింది.
Also Read: Rebal Star: ప్రభాస్ ను ఏమైనా అంటే ఊరుకునేది లేదు.. ఖబర్దార్: మంచు విష్ణు
ఆగస్టు 9న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికి థియేటర్లలో రన్ అవుతూ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతుంది. రెండు వరాలు సక్సెస్ ఫుల్ గా ముగించుకుని మూడవ వారంలో అడుగు పెట్టింది కమిటీ కుర్రోళ్ళు. ఈ నేపథ్యంలో మేకర్స్ సరికొత్తగా ప్లాన్ చేసారు. సినిమా నిడివి పెరుగుతుందన్న కారణంగా కట్ చేసిన కొన్ని కామెడీ సీన్స్ ను మూడవ వారం నుండి తిరిగి యాడ్ చేసారు మేకర్స్. దీంతో ఈ రోజు ఈ సినిమాకు మరికొంత కలెక్షన్ యాడ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు బయ్యర్స్. వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం రెండు వారాలలో 15.6 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి అన్నీ ఏరియాస్‌లో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలు తెస్తోంది. వినాయకచవితి వరకు పెద్ద సినిమాలు ఏవి లేకపోవడం, ఆగస్టు 15 స్టార్ హీరోల సినిమాలు థియేటర్ల నుండి తీసేయడంతో కమిటీ కుర్రోళ్ళుకు లాంగ్ రన్ కు మంచి అవకాశం దొరికినట్టైంది. ఈ సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాలలో వంశి నందిపాటి రిలీజ్ చేసారు.