చాలా మంది ఫ్యాన్స్ నే కాదు సాధారణ జనాన్ని కూడా షాక్ గురి చేసింది హృతిక్ రోషన్ విడాకుల వ్యవహారం. ప్రేమించి పెళ్లి చేసుకున్న సుజానే ఖాన్ కి ఎన్నో ఏళ్ల తరువాత డైవోర్స్ ఇచ్చాడు హృతిక్. కారణాలు ఏవైనప్పటికీ అప్పట్లో సుజానే 4 వందల కోట్లు భరణంగా అడిగిందని ప్రచారం జరిగింది. హృతిక్ ఆ వార్తల్ని ఖండించినప్పటికీ ఆమెకు 380 కోట్ల దాకా ఇచ్చినట్టు బాలీవుడ్ లో చెప్పుకుంటారు…
సైఫ్ అలీఖాన్ కూడా డైవోర్స్ రూపంలో భారీగా నష్ట పరిహారం చెల్లించుకున్న వాడే! ఆయన మొదటి భార్య అమృతా సింగ్. ఈ తరం బీ-టౌన్ బ్యూటీ సారా అలీఖాన్ కు ఆమె తల్లి. అయితే, 13 ఏళ్ల కాపురం తరువాత సైఫ్, అమృతా విడిపోవాల్సి వస్తే మిష్టర్ ఖాన్ భరణాన్ని భారీగానే ముట్టజెప్పాడట. ఎంత అనేది బయటకు రాకున్నా అప్పటి సైఫ్ ఆస్తిలో సగం ఎక్స్ వైఫ్ కు ఇవ్వాల్సి వచ్చిందట!
ఆమీర్ ఖాన్ , రీనా దత్తా మతాంతర వివాహం కూడా వివాదాస్పదంగానే మొదలై, వివాదాస్పదంగానే ముగిసింది. ఆమీర్, రీనా పెద్దల అమోదం లేకుండా పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లకే ఇద్దరూ విడిపోవాల్సిన స్థితి వచ్చింది. అయితే, ఆమీర్ డైవోర్స్ లో భాగంగా పెద్ద మొత్తం రీనా దత్తాకి ఇచ్చాడంటారు. ఎంత అనేది మాత్రం ఇప్పటికీ రహస్యమే!
యశ్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా సైతం వివాహేతర సంబంధంతో విడాకుల పాలయ్యాడు. ఆయన రాణీ ముఖర్జీతో ప్రేమ వ్యవహారం నడపటం భార్య పాయల్ ఖన్నాకి నచ్చలేదు. ఆమె అతడి చిన్న నాటి స్నేహితురాలైనప్పటికీ డైవోర్స్ కే మొగ్గు చూపింది. బాలీవుడ్ నంబర్ వన్ నిర్మాత అయిన ఆదిత్య చోప్రా మాజీ భార్యకి ఎంత ఇచ్చాడన్నది బయటకు రాలేదు. కానీ, పెద్ద మొత్తమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా!
కరిష్మా కపూర్ విడాకుల వ్యవహారం 2014-16 మధ్య వార్తల్లో నిలిచింది. వారు విడిపోయే క్రమంలో కరిష్మా మాజీ భర్త సంజయ్ కపూర్ 14 కోట్ల విలువైన బాండ్లను పిల్లల పేరు మీద కొన్నాడట. వాటిపై నెలకు పది లక్షల దాకా వడ్డీ వస్తుందని అంటారు. అంతే కాదు, సంజయ్ కపూర్ ముంబైలోని ఖార్ ఏరియాలో ఉన్న తన ఖరీదైన ఇంటిని కూడా కరిష్మా పేరున రాశాడట!
సంజయ్ దత్, రియా పిళ్లై కూడా అప్పట్లో వార్తల్లో నిలిచారు. వారి విభేదాలు న్యూస్ గా మారాయి. సంజయ్ నుంచీ విడిపోతూ రియా ఒక సీ ఫేసింగ్ అపార్ట్మెంట్, ఖరీదైన కార్ భరణంగా పొందిందట!
బాలీవుడ్ నటీనటులు, సెలబ్స్ లాగే మన ప్రభుదేవా విడాకుల వ్యవహారం కూడా దేశమంతా చర్చనీయాంశం అయింది. నయనతారతో ప్రభు ఎఫైర్ కారణంగా ఆయన భార్య రమాలత్ ఆగ్రహానికి గురైంది. తీవ్రమైన వివాదం కూడా చెలరేగింది. చివరకు, ఆమె పది లక్షల రూపాయలు, రెండు ఖరీదైన కార్లు, 20-25 కోట్ల మధ్య విలువ చేసే ఆస్తిని డైవోర్స్ లో భాగంగా పొందిందట!