Site icon NTV Telugu

Power Star: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్..

Untitled Design (47)

Untitled Design (47)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తమ హీరో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాదించడంతో పాటు ప్రస్తుత క్యాబినెట్ లో మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. కానీ పవర్ స్టార్ ను మరో సారి సిల్వర్ స్క్రీన్ ఫై చూడాలని ఫ్యాన్స్ ఈగర్ గ ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీగా ఉండడంతో ఈ హీరో నటిస్తున్న సినిమాల సంగతి అయోమయంలో ఉన్నాయి. పవన్ సినిమాల్లో నటిస్తాడా లేదా అన్న డైలమా అందరిలోనూ నెలకొంది.

వినిపిస్తున్న సమాచారం మేరకు త్వరలోనే ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసారట నిర్మాత DVV దానయ్య. పవన్ తో OG చిత్రాన్ని నిర్మిస్తున్నారు నిర్మాత దానయ్య. దాదాపు 70% షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. పవన్ కళ్యాణ్ కు సంబంధించి కేవలం పది లేదా పదిహేను రోజుల షూటింగ్ మాత్రమే షూట్ బ్యాలెన్స్ ఉందని టాక్. కాగా OG సినిమా కచ్చితంగా పూర్తి చేస్తానని నిర్మాత డివివి దానయ్యకు హామీ ఇచ్చారట పవన్ కళ్యాణ్. ఈలోగా పవన్ ఇలా వస్తే సినిమాలోని కీలక సన్నివేశాలను చక చక పూర్తి చేసేందుకు అటు నిర్మాత దానయ్య , దర్శకుడు సుజిత్ ఏర్పాట్లు చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే OG సెట్స్ లో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ తో ఫ్యాన్స్ అంచనాలు తార స్థాయికి చేరాయి.

Also  Read: Tollywood : నైజాంలో దూసుకెళ్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ. 

Exit mobile version