Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మిస్ పుణె ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ట్విషా భర్త సమర్థ్ సింగ్ పరారీలో ఉండటంతో కేసు ఉత్కంఠ రేపుతోంది. ట్విషా భర్త సమర్థ్ సింగ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అతను దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు ఇప్పటికే ముందస్తుగా లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. సమర్థ్ ఆచూకీ కనిపెట్టేందుకు ఏకంగా ఆరు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు మధ్యప్రదేశ్ రాష్ట్రంతో పాటు అనుమానం ఉన్న ఇతర రాష్ట్రాల్లోనూ ముమ్మరంగా జల్లెడ పడుతున్నాయి.
ఇదే సమయంలో, సమర్థ్ సింగ్ ఎక్కడున్నాడో కచ్చితమైన సమాచారం ఇచ్చి, అతని ఆచూకీ చెప్పిన వారికి రివార్డ్ ఇస్తామని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న సమర్థ్ సింగ్.. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అయితే, అతనికి కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సమర్థ్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం దాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. కేసు తీవ్రత దృష్ట్యా బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. మరోవైపు, ట్విషా శర్మ మృతిపై ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇది సహజ మరణం కాదని, అత్తింటివారే పథకం ప్రకారం తమ కూతురిని దారుణంగా చంపేశారని వారు ఆరోపిస్తున్నారు. అదనపు కట్నం తీసుకురావాలంటూ అత్తమామలు ట్విషాను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధించారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రస్తుతం పోలీసుల రాడార్‌లో ఉన్న ప్రధాన నిందితుడు సమర్థ్ ఆచూకీ దొరికితే.. ఈ కేసులో మరిన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read
- Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
- Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్'తో యష్.. అంతా ఒట్టిదేనట!
- Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
- Vijay Deverakonda: 'రణబాలి'లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!