B – Town : హీరోగా షెడ్డుకెళ్ళాడన్నారు.. సీక్వెల్ సినిమాతో వంద కోట్లు కొట్టేసాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు ఇమ్రాన్ హష్మీ అంటే రొమాన్స్, మ్యూజిక్, ఇంటెన్స్ లవ్ స్టోరీస్ కానీ ఆ ఇమేజ్‌కి కాలం చెల్లిపోయిందనే టైమ్‌లో ‘ఆవారాపన్ 2’తో మళ్లీ బాక్సాఫీస్‌పై తన మార్క్ చూపించాడు. ‘ఆవారపన్ 2’… విడుదలైన ఐదు రోజుల్లోనే ఇండియాలో 100.75 కోట్ల నెట్, వరల్డ్‌వైడ్‌గా 144.13 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇమ్రాన్ హష్మీ మెయిన్ లీడ్‌గా నటించి 100 కోట్ల క్లబ్‌లోకి వెళ్లిన తొలి సినిమా ఇదే. అంటే చాలా కాలంగా ఎదురుచూస్తున్న సోలో సక్సెస్ ఇప్పుడు సీక్వెల్ రూపంలో దక్కింది.
అసలు ఈ సక్సెస్‌కి బలం 2007లో వచ్చిన ‘ఆవారపన్’కున్న కల్ట్ ఫాలోయింగే. ఆ సినిమా అప్పట్లో థియేటర్లలో పెద్దగా ఆడకకపోయినా కాలక్రమంలో శివ్ పండిట్ క్యారెక్టర్, మ్యూజిక్, ఇమ్రాన్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్కి స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అదే నోస్టాల్జియా థియేటర్లలోకి ఆడియన్స్‌ను తీసుకొచ్చిందనే చర్చ జరుగుతోంది. రీసెంట్ టైమ్‌లో ఇమ్రాన్ హీరోగా మాత్రమే కాకుండా యాంటాగనెస్ట్, క్యారెక్టర్ రోల్స్ కూడా ఎంచుకున్నాడు
‘OG’, ‘G2’ వంటి సినిమాలతో కొత్త ఇమేజ్‌కి షిఫ్ట్ అవుతున్న టైమ్‌లో ‘ఆవారపన్ 2’ మాత్రం ఇప్పుడు సోలో హీరోగా తన మార్కెట్ ఇంకా ఉందని ప్రూవ్ చేసింది. అందుకే ఇది కేవలం మరో హిట్ కాదు ఒకప్పుడు తగ్గిపోయిందనుకున్న స్టార్ మార్కెట్‌ను మళ్లీ రీసెట్ చేసిన కెరీర్ కంబ్యాక్ అంటున్నారు ఫ్యాన్స్.
Also Read
- IRUMUDI : ఇరుముడి ఓవర్సీస్ రివ్యూ.. రవితేజ మాస్ కంబ్యాక్ 'బ్లాక్ బస్టర్'
- Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
- Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
- Mahesh - Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
తాజావార్తలు
-
B – Town : హీరోగా షెడ్డుకెళ్ళాడన్నారు.. సీక్వెల్ సినిమాతో వంద కోట్లు కొట్టేసాడు
-
Explainer: 4 నెలలు.. 22 ఉ*రిశిక్షలు.. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఈ తీర్పుల వెనుక ఉన్న జడ్జీ ఎవరు?
-
BYD Sealion 7 Dynamic Launch: BYD సీలియన్ 7 డైనమిక్ విడుదల.. 71.8kWh బ్యాటరీ, 520KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
IRUMUDI : ఇరుముడి ఓవర్సీస్ రివ్యూ.. రవితేజ మాస్ కంబ్యాక్ ‘బ్లాక్ బస్టర్’
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!