B – Town : హీరోగా షెడ్డుకెళ్ళాడన్నారు.. సీక్వెల్ సినిమాతో వంద కోట్లు కొట్టేసాడు

Imran Hashmi

Imran Hashmi

ఒకప్పుడు ఇమ్రాన్ హష్మీ అంటే రొమాన్స్, మ్యూజిక్, ఇంటెన్స్ లవ్ స్టోరీస్ కానీ ఆ ఇమేజ్‌కి కాలం చెల్లిపోయిందనే టైమ్‌లో ‘ఆవారాపన్ 2’తో మళ్లీ బాక్సాఫీస్‌పై తన మార్క్ చూపించాడు. ‘ఆవారపన్ 2’… విడుదలైన ఐదు రోజుల్లోనే ఇండియాలో 100.75 కోట్ల నెట్, వరల్డ్‌వైడ్‌గా 144.13 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇమ్రాన్ హష్మీ మెయిన్ లీడ్‌గా నటించి 100 కోట్ల క్లబ్‌లోకి వెళ్లిన తొలి సినిమా ఇదే. అంటే చాలా కాలంగా ఎదురుచూస్తున్న సోలో సక్సెస్  ఇప్పుడు సీక్వెల్ రూపంలో దక్కింది.

అసలు ఈ సక్సెస్‌కి బలం 2007లో వచ్చిన ‘ఆవారపన్’కున్న కల్ట్ ఫాలోయింగే. ఆ సినిమా అప్పట్లో థియేటర్లలో పెద్దగా ఆడకకపోయినా కాలక్రమంలో శివ్ పండిట్ క్యారెక్టర్, మ్యూజిక్, ఇమ్రాన్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్‌కి స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అదే నోస్టాల్జియా థియేటర్లలోకి ఆడియన్స్‌ను తీసుకొచ్చిందనే చర్చ జరుగుతోంది. రీసెంట్ టైమ్‌లో ఇమ్రాన్ హీరోగా మాత్రమే కాకుండా యాంటాగనెస్ట్, క్యారెక్టర్ రోల్స్ కూడా ఎంచుకున్నాడు
‘OG’, ‘G2’ వంటి సినిమాలతో కొత్త ఇమేజ్‌కి షిఫ్ట్ అవుతున్న టైమ్‌లో ‘ఆవారపన్ 2’ మాత్రం ఇప్పుడు సోలో హీరోగా తన మార్కెట్ ఇంకా ఉందని ప్రూవ్ చేసింది. అందుకే ఇది కేవలం మరో హిట్ కాదు ఒకప్పుడు తగ్గిపోయిందనుకున్న స్టార్ మార్కెట్‌ను మళ్లీ రీసెట్ చేసిన కెరీర్ కంబ్యాక్ అంటున్నారు ఫ్యాన్స్.