Site icon NTV Telugu

Erracheera: ఎర్రచీర…పట్టుకుంటే ఐదు లక్షలు!

Erracheera

Erracheera

ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘ఎర్రచీర’. ‘ది బిగినింగ్’ అనేది ట్యాగ్ లైన్. సుమన్ బాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించడమే కాకుండా ఇందులో కీలక పాత్రను పోషించారు. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమా 25 ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే పలు సాంకేతిక కారణాలతో విడుదల వాయిదా పడింది. ఇప్పుడీ సినిమాను వేసవి కానుకగా మే రెండో వారంలో విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాత సుమన్ బాబు తెలిపారు.

Pahalgam Terror Attack: ఆబిర్‌ గులాబ్‌ సినిమా బ్యాన్‌!

ఆయన మాట్లాడుతూ ‘’ఈ నెల 25న రిలీజ్ కావాల్సిన ఎర్రచీర కొన్ని టెక్నికల్ కారణాలతో వాయిదా పడింది. మే నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. కంటెంట్ మాత్రం ఖతర్నాక్ గా ఉంటుంది. కామెడీ, హారర్, మదర్ సెంటిమెంట్, యాక్షన్ అన్నీ కలగలిపి ఎక్కడా బోర్ కొట్టకుండా సిద్ధం చేసుకున్నాం. సినిమా చూసి బయటకు వెళ్లే ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుని బయటికి వెళ్తారు అని చెప్పగలను. సెన్సార్ సభ్యులు కూడా సినిమా చూసి అభినందించారు. భలే సినిమా చేశారని అన్నారు. ఈ సినిమాకి ఒక కాంటెస్ట్ అనౌన్స్ చేస్తున్నాం. సినిమా కథ కరెక్టుగా రిలీజ్ కి ముందు గెస్ చేస్తే ఐదు లక్షలు ప్రైజ్ మనీ ఇస్తాం. 8019246552 నంబర్ కి కరెక్ట్ కథ చెప్పినవారికి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది’’ అని అన్నారు.

Exit mobile version