NTV Telugu Site icon

‘లవ్లీ’ హిందీ డబ్బింగ్ వెర్షన్ కు అద్భుతమైన రెస్పాన్స్…!

Entertainer Lovely Hindi Dubbed Version Vijay Meri Hai crosses 50+ Million Views

బి.జయ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ‘లవ్లీ’. 2012 మార్చి 30న విడుదలైన ఈ చిత్రంలో ఆది, శాన్వీ జంటగా నటించగా… నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలకపాత్రల్లో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ను సాధించింది. ఆర్.ఆర్. మూవీ మేకర్స్, ఆర్జే సినిమా బ్యానర్లపై ఆర్.ఆర్. వెంకట్, బి.ఎ. రాజు సంయుక్తంగా నిర్మించిన ‘లవ్లీ’ మూవీ సాంగ్స్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలై ప్రేక్షకులను బాగా అలరించాయి. ఈ మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ కు ఇప్పుడు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ‘లవ్లీ’ మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ ను యూట్యూబ్ లో విడుదల చేయగా… 50 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ‘విజయ్ మేరీ హై’ టైటిల్ తో హిందీలో డబ్ అయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వస్తోంది. కాగా ఇది వరకే పలు టాలీవుడ్ చిత్రాల హిందీ డబ్బింగ్ వెర్షన్ లు విడుదలై పలు రికార్డులు నమోదు చేసిన విషయం తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన జయ జానకి నాయక 400+ మిలియన్ వ్యూస్ పైగా సాధించగా… రామ్ ఉన్నది ఒకటే జిందగీ, అల్లు అర్జున్ రేసుగుర్రం తదితర తెలుగు చిత్రాలు హిందీలో డబ్ అయ్యి యూట్యూబ్ లో భారీ వ్యూస్ ను రాబట్టాయి. ఇక ఇప్పుడు బాలీవుడ్ కన్ను టాలీవుడ్ పై పడింది. జెర్సీ, అర్జున్ రెడ్డి తదితర చిత్రాలు బాలీవుడ్ లో రీమేక్ కావడమే అందుకు నిదర్శనం.