మాలీవుడ్ తో పాటుగా తదుపరి భాషలో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ‘లూసిఫర్ 2: ఎంపురాన్’. నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ‘లూసిఫర్’ చిత్రానికి సీక్వెల్ గా ‘ఎంపురాన్’ చిత్రం రాబోతుంది. మోహన్ లాల్ మెయిన్ లీడ్ లో నటించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా మొదటి భాగం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే నటుడిగా అందరికీ తెలిసిన పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం అనగానే..గతంలో అందరూ కాస్త సందేహంగా చూశారు.
Also Read:Mufasa: OTT లోకి వచ్చేస్తున్న ‘ముఫాసా:ది లయన్ కింగ్’
కానీ ఎప్పుడైతే మొదటి ‘లూసిఫర్’ తిరుగులేని హిట్ అందుకుందో అప్పటి నుండి అతని డైరెక్షన్ టాలెంట్ ఏంటో అందరికీ అర్థమైంది. దీంతో ‘ఎంపురాన్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దీపక్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. ప్రమోషన్ లో భాగంగా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ఎంతో ఆకట్టుకోగా. ఆశీర్వాద్ సినిమాస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో మంజు వారియర్, టోవినో థామస్, ఇంద్రజిత్ సుకుమారన్, జైస్ జోస్.. లాంటి స్టార్స్ అందరూ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్, జైస్ జోస్ పోషించిన జేవియర్ పాత్ర పోస్టర్ ను విడుదల చేశారు. అంతే కాదు దీంతో పాటుగా నటుడు జైస్ జోస్ ఈ మూవీ చిత్రీకరణ అనుభవాలను వీడియో ద్యారా పంచుకున్నారు. ప్రజంట్ ఈ పోస్టర్ వీడియో వైరల్ అవుతుంది.
Character No: 36 🎭 Presenting Jaise Jose as Xavier in #L2E 🔥 In the world of #Empuraan every character leaves a mark. ⚡️#L2E Releasing on 27th March 2025 🗓️ @mohanlal @PrithviOfficial #MuraliGopy @LycaProductions #Subaskaran @gkmtamilkumaran @antonypbvr @aashirvadcine… pic.twitter.com/1SmAMQ6nsG
— Lyca Productions (@LycaProductions) February 9, 2025