NTV Telugu Site icon

Dulquer Salmaan : ఓవర్సీస్ లో వన్ ‘మిలియన్ భాస్కర్‌’

Lakki

Lakki

మలయాళ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా వచ్చిన స్ట్రయిట్ తెలుగు సినిమా లక్కీ భాస్కర్. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రంలో అందాల తార మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. దీపావళి కానుకగా అక్టోబరు 30న ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో పాటు రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతోంది. మరోవైపు ఓవర్సీస్ లో ఈ ఈసినిమా అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. లక్కీ భాస్కర్ తో పాటు రిలీజ్ అయిన సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేస్తోంది.

Also Read : Kannappa : ప్రభాస్ ఫోటో లీక్ చేసిన వారిని పట్టుకుంటే 5 లక్షలు : మంచు విష్ణు

దుల్కర్ సల్మాన్ కు తెలుగులో మంచి మార్కెట్ వుంది. ఆ విషయం మరోసారి ప్రూఫ్ అయింది. నాలుగు సినిమాల మధ్య పోటీగా విడుదలైన లక్కీ భాస్కర్ ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.12.7 కోట్లకు పైగా గ్రాస్‌ వసూలు చేసింది. ఇక విడుదల నాటి నుండి ఇప్పటివరకు విడుదలైన 8 రోజులకు గాను 74.01 కోట్లు కొల్లగొట్టింది.కాగా ఓవర్సీస్ లో రిలీజ్ రోజు నుండి సూపర్ హిట్ మౌత్ టాక్ తో దూసుకెళ్తూ 1 మిలియన్ డాలర్స్ రాబట్టి ఇప్పటికి స్టడీగా కలెక్షన్స్ రాబడుతోంది. దుల్కర్ కు తెలుగులో ఈ ఇది హ్యాట్రిక్ హిట్. మహానటి, సీతారామం ఇప్పుడు లక్కీ భాస్కర్ తో వంద కోట్ల క్లబ్ లో చేరబోతున్నాడు దుల్కర్. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ్, మలయాళంలో లక్కీ భాస్కర్ బయ్యర్స్ భారీ లాభలు చూడబోతున్నారు. నేడు రేపు వీకెండ్ కావడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది

Show comments