Site icon NTV Telugu

Dulquer : సీఎం రేవంత్ రెడ్డితో.. హీరో దుల్కర్ సల్మాన్ ప్రత్యేక భేటీ!

Dulquer Salmaan Revanth Reddy

Dulquer Salmaan Revanth Reddy

మలయాళ సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన దుల్కర్ సల్మాన్.. ప్రజంట్ తెలుగులోనూ మంచి ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకుంటున్నారు. ‘మహానటి’ తో మొదలు.. ‘సీత రామం’ తో మరో హిట్ అందుకొని, ‘లక్కీ భాస్కర్’ తో ఊహించని విజయం సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాల ద్వారా ఆయనకు తెలుగు ప్రేక్షకుల్లో విశేష క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘కాంత’. ఈ సినిమాను రానాకు చెందిన స్పిరిట్ మీడియా భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోండగా.. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుంది. సముద్రఖని, రవీంద్ర విజయ్ వంటి ప్రముఖ నటులు కూడా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1950ల నాటి కాలక్రమాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న ఈ చిత్రం పీరియడ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే తాజాగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు దుల్కర్ సల్మాన్. ఆయనతో పాటుగా సినీ నిర్మాత స్వప్న దత్, తదితరులు కూడా ఉన్నారు.

Exit mobile version