NTV Telugu Site icon

Dulquer Salmaan : లక్కీ భాస్కర్ రన్నింగ్ సూపర్..మొత్తం ఎన్ని కొట్లో తెలుసా..?

Lakki

Lakki

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. తెలుగులో “మహానటి”, “సీతా రామం” వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న ఆయన, “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మీనాక్షి చౌదరి కథానాయిక. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అయింది

Also Read : Bachhala Malli : అల్లరి నరేశ్ ‘బచ్చల మల్లి’ రిలీజ్ డేట్ ఇదే..

కాగా ఒకరోజు ముందుగా ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తోలి ఆట నుండి సూపర్ హిట్ టాక్ అందుకుంది. దుల్కర్ నటన, వెంకీ అట్లూరి దర్శకత్వం ఆడియెన్స్ ను అలరించింది. బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న ఈ సినిమా తోలి రోజు రూ. 12.7 కోట్లు కొల్లగొట్టి దుల్కర్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ అందుకుంది. తాజాగా ఈ సినిమా మూడవ వారంలోకి ఎంటర్ అయింది. మూడు వారాలకు గాను ఈ చిత్రం రూ. 111 కోట్ల గ్రస్స్ అందుకుంది. ఈ కలెక్షన్స్ దుల్కర్ కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఇక తమిళ్ కలెక్షన్స్ చుస్తే 18 రోజులకు గాను ఈ సినిమా 16 కోట్ల గ్రాస్ రాబట్టి స్టడీ గా రన్ అవుతోంది. కేరళలోను రూ. 23 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. పుష్ప రిలీజ్ వరకు లక్కీ భాస్కర్ కు లాంగ్ రన్ ఉండే అవకాశం మెండుగా ఉంది

Show comments