Site icon NTV Telugu

Kaantha : దుల్కర్ సల్మాన్ కాంత టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

Kaantha

Kaantha

మలయాళ స్టార్  దుల్కర్ సల్మాన్  హీరోగా దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తో చేస్తున్న స్ట్రయిట్ తెలుగు సినిమా కాంతా. లక్కీ భాస్కర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన  దుల్కర్ సల్మాన్ మరియు భాగ్యశ్రీ బోర్సేల ఫస్ట్ లుక్ పోస్టర్లకు విశేష స్పందన రాగా  మేకర్స్ ఇప్పుడు ఈ చిత్రం నుండి మరొక ముఖ్యమైన పాత్రను పరిచయం చేశారు.

Also Read : Black Mailing : హీరోయిన్ పై పీఆర్ టీమ్ నెగిటివ్ క్యాంపైన్..

1950ల కాలంలో మద్రాసులో జరిగిన ఒక ఉత్కంఠభరితమైన నాటకీయ థ్రిల్లర్ గా తెరపైకెక్కుతున్న డుల్కర్ కెరీర్ లో మరో డిఫ్రెంట్ సబ్జెట్ కాబోతుందని టాలీవుడ్ ఓ టాక్.  కాగా కాంత టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేసారు మేకర్స్. ఈ నెల 28న దుల్కర్ సల్మాన్ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం ఈ సినిమా టీజర్ రిలీజ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ కు సంబంధించి సెన్సార్ కూడా ఫినిష్ చేశారు. మొత్తం 2.14 నిమిషాల నిడివితో రాబోతుంది కాంత టీజర్. చాలా గ్రాండియర్ గా  దుల్కర్ మార్క్ డైలాగ్స్ ఉండేలా టీజర్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ నట విశ్వరూపం చూస్తారని టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయి, పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను   టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లో ఒకటైన సురేష్ ప్రొడక్షన్స్ , దుల్కర్ సొంత ప్రొడక్షన్ వేఫారెర్ బ్యానర్స్ పై  రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషలలో తీసుకురానున్నారు.

Exit mobile version