Site icon NTV Telugu

Dulquer Salmaan : OTT లోకి దుల్కర్ సల్మాన్ ‘ఒక యముడి ప్రేమకథ’..

Dulquer Salmaan,‘oka Yamudi Premakatha’,

Dulquer Salmaan,‘oka Yamudi Premakatha’,

సీతారామం, కల్కి, లక్కీ భాస్కర్ వంటి వరుస హిట్ చిత్రాలతో దుల్కర్ సల్మాన్ తెలుగు హీరోగా ఇక్కడ కూడా మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న అభిమానంతో పాటు బాక్స్ ఆఫీస్ విజయాలతో, ప్రస్తుతం ఆయన నటిస్తున్న తెలుగు చిత్రాలు ఒక్కొక్కటి రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించబడుతున్నాయి. ఈ విధంగా ఆయన టాలీవుడ్‌ టాప్ హీరోల సరసన నిలిచారు. కాగా ప్రస్తుతం దుల్కర్, రాణా దగ్గుబాటి స్పిరిట్ మీడియా నిర్మిస్తున్న ‘కాంతా’, స్వప్న సినిమాస్ నిర్మాణంలో రూపొందుతున్న ‘ఆకాశంలో ఒక తారా’ అనే రెండు తెలుగు ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. ఆయనకు ఉన్న పాన్ ఇండియా క్రేజ్, నటనలోని నైపుణ్యం భారతదేశంలోని అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక

Also Read : Pawan Kalyan : టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తున్న వీరమల్లు టీమ్..!

తాజాగా ఇప్పుడు ఆహా ఓటీటీ సంస్ధ దుల్కర్ సల్మాన్ నటించిన మలయాళ బ్లాక్‌బస్టర్‌ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. కామోడి థ్రిలర్‌గా తెరకెక్కి అభిమానుల మన్ననలు పొందిన ‘ఒరు యమండన్ ప్రేమకథ’ చిత్రం ‘ఒక యముడి ప్రేమకథ’ పేరుతో ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను తెలుగులో భవాని మీడియా విడుదల చేయనుండగా, దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదుగుతున్న ప్రయాణంలో ఇది మరొక మైలురాయి. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే తీసేయండి.

Exit mobile version