Site icon NTV Telugu

DSP: మరోసారి వార్తల్లోకి దేవిశ్రీ ప్రసాద్.. పుష్పనే టార్గెట్ చేశాడా?

Devi Sri Prasad

Devi Sri Prasad

టాలీవుడ్‌లో ఉన్నది ఉన్నట్లు బయటకు మాట్లాడే వ్యక్తుల్లో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఒకరు. తన వర్క్ గురించి, లేదా సినిమాకి సంబంధించిన ఏదైనా విషయంలో. దర్శక నిర్మాతలు మాట్లాడిన మాటలు నచ్చకపోతే.. సినిమా వేదికపైనే వారికి నిరభ్యంతరంగా సమాధానమిస్తాడు. అలాంటి దేవిశ్రీప్రసాద్ తాజాగా రెమ్యూనరేషన్ గురించి చేసిన హాట్ టాపిక్ గా మారాయి. జూన్ 20న విడుదలైన ‘కుబేర’ మూవీ మంచి కలెక్షన్లు సాధించగా, ఈ సందర్భంగా జరిగిన సక్సెస్ మీట్‌ లో చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో దేవిశ్రీ ప్రసాద్ చేసిన కామెంట్లు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Also Read : Jana Nayagan : ఇదేంట్రా.. విజయ్ చివరి సినిమా అన్నారు కదా..!

DSP మాట్లాడుతూ.. ‘కుబేర నిర్మాత సునీల్ నారంగ్ గారు నా రెమ్యూనరేషన్ పూర్తిగా సినిమా విడుదలకు ముందే క్లియర్ చేశారు. సినిమా బ్లాక్ బస్టర్ అయింది. టైం కి పేమెంట్ కూడా వచ్చేసింది. మ్యూజిక్ బాగుందని పొగిడారు కూడా. అంతకంటే ఇంకేం కావాలి?’ అని ఆనందం వ్యక్తం చేశారు. అంతలోనే యాంకర్ ‘సునీల్ గారు సక్సెస్ మీట్‌లో మాట్లాడతానన్నారు. మీరు మాట్లాడించాలి’ అనగా, DSP వెంటనే స్పందిస్తూ..

‘పేమెంట్ ఇస్తానని బాకీ పెట్టడం కంటే, మాట్లాడతానని బాకీ పెట్టడం మంచిదే’ అని వ్యాఖ్యానించారు. ఇక ఈ మాటలు వినగానే అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. పేమెంట్ బాకీ పెట్టిన వారు ఎవరు? ఆయన మాటలు పరోక్షంగా మైత్రి మూవీ మేకర్స్ గురించా? అనే చర్చ మొదలైంది. ఎందుకంటే ‘పుష్ప 2’ సమయంలో దేవిశ్రీ–మైత్రి మధ్య కొంత దూరం ఏర్పడినట్లు టాక్ వినిపించింది. ఆ నేపథ్యంలో ఇప్పుడు DSP చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా అల్లు అర్జున్–సుకుమార్ టీమ్‌కి సంకేతంగా అనిపిస్తున్నాయి. అయితే, ఆయన స్పష్టంగా ఎవరి పేరు చెప్పలేదు. కానీ టాలీవుడ్ వర్గాల్లో మాత్రం ఈ కామెంట్స్ ఊపందుకున్నాయి.

Exit mobile version