Site icon NTV Telugu

Drishyam 3 : పాన్‌ ఇండియా లెవల్‌లో దృశ్యం- 3..!

Drushyam 3

Drushyam 3

మలయాళంలో వచ్చిన ‘దృశ్యం’ ఫ్రాంచైజీ ఎంతటి విజయాన్ని అందుకుందో చెప్పక్కర్లేదు. ఫ్యామిలీ థ్రిల్లర్ అనే కొత్త జానర్ సృష్టించి, బ్లాక్ బస్టర్ సాధించిన ఈ చిత్రం ఇప్పటి వరకు రెండు భాగాలుగా వచ్చింది. అంతే కాదు ఈ ఫ్రాంచైజీ ఇతర భాషల్లోనూ రీమేక్‌ అవ్వగా.. మలయాళంలో మోహన్ లాల్, తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగన్, కన్నడలో రవిచంద్రన్ నటించారు.. ప్రతి భాషలోనూ భారీ విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా దృశ్యం మూడో భాగం స్క్రిప్ట్ సిద్ధమవుతుందనే వార్త తెగ వైరల్ అవుతుంది. అతి కూడా ఒరిజినల్ మోహన్ లాల్ వెర్షన్‌ని ప్యాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న ఉన్నారట నిర్మాత ఆంటోనీ పెరువంబూర్. దర్శకుడు జీతూ జోసెఫ్ కథని సిద్ధం చేశారని, ఫైనల్ వెర్షన్‌ని త్వరలోనే లాక్ చేసి ది కంక్లూజన్ పేరుతో ముగింపు ఇస్తారు అని టాక్.

Also Read: Bollywood : నా ఫ్యామిలీ జోలికి రావద్దు.. అనురాగ్ కశ్యప్ కామెంట్స్ వైరల్

ఈ వార్త గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ప్రేక్షకులకు మోహన్‌లాల్ ‘దృశ్యం 3’ కనెక్ట్ కాకపోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే దృశ్యం మూవీని తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగన్, కన్నడలో రవిచంద్రన్ నటించారు. సో అని భాషలో మోహన్ లాల్ హీరో అంటే ప్రేక్షకులు అంగీకరించక పోవచ్చు. అలాంటప్పుడు దృశ్యం 3 బిజినెస్ పరంగా రిస్క్ అవుతుందని చెప్పవచ్చు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే బాలీవుడ్‌లో ఆల్రెడీ అజయ్ దేవగన్ మూడో భాగం కోసం వేరే కథను సిద్ధం చేయిస్తున్నాడట. దర్శకత్వం ఎవరనేది తేలినప్పటికీ బాలీవుడ్ లో ఈ టాక్ మాత్రం వినిపిస్తోంది.

Exit mobile version