Drishyam 3 : మోహన్ లాల్ ఖాతాలో మరో రికార్డ్.. జస్ట్ 7 రోజుల్లో సెన్సేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ సూపర్ స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ బాక్సాఫీస్ వద్ద మళ్లీ తన విశ్వరూపం చూపిస్తున్నాడు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ‘దృశ్యం 3’ థియేటర్లలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. జార్జ్‌కుట్టి ఫ్యామిలీని వెతుక్కుంటూ వచ్చిన ఈ సూపర్ హిట్ ఫ్రాంచైజీ విడుదలైన మొదటి రోజు నుంచే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ మాలీవుడ్‌లో సరికొత్త సంచలనం సృష్టించింది.
ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు సైతం షాక్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన కేవలం 7 రోజుల్లోనే ‘దృశ్యం 3’ ఏకంగా రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్కును దాటేసింది. మొదటి వీకెండ్లోనే భారీ కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం వర్కింగ్ డేస్‌లో కూడా అదే జోష్ చూపిస్తుంది. దృశ్యం ఫ్రాంచైజీలోనే అత్యంత వేగంగా మరియు మొదటిసారి రూ. 200 కోట్లు సాధించిన చిత్రంగా దృశ్యం 3 సరికొత్త రికార్డు నెలకొల్పింది. సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు కాస్త నెగెటివ్ లేదా మిక్స్డ్ టాక్ వస్తే వసూళ్లు పడిపోతాయి. ‘దృశ్యం 3’ విషయంలో కూడా మొదటి రోజు మిక్డ్స్ రెస్పాన్స్ వచ్చింది. కానీ జార్జ్‌కుట్టి క్యారెక్టర్‌కు ఉన్న క్రేజ్, క్లైమాక్స్ ట్విస్టులు థియేటర్లకు ఫుట్ ఫాల్స్ పెంచాయి. గత కొంతకాలంగా సరైన సాలిడ్ హిట్ కోసం చూస్తున్న మోహన్ లాల్, ఈ సినిమాతో మళ్లీ మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తన నంబర్ వన్ స్థానాన్ని సగర్వంగా ఆక్యుపై చేశారు. కేరళలోనే కాకుండా ఓవర్సీస్ ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, యూఎస్, యూకేలో ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ రేంజ్ కలెక్షన్ల సునామీ చూస్తుంటే రాబోయే రోజుల్లో ‘దృశ్యం 3’ మరిన్ని భారీ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!