Draupathi 2: నేతాజీ ప్రొడక్షన్స్ తరపున చోళ చక్రవర్తి, జీఎం ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రం ‘ద్రౌపతి -2’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. ‘పళయ వన్నారపెట్టై’, ‘ద్రౌపతి’, ‘రుద్ర తాండవం’, ‘బకాసురన్’ లాంటి విజయవంతమైన సినిమాలను తెరకెక్కించిన మోహన్.జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో రిచర్డ్ రిషి, రక్షణ ఇందుసుదన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నట్టి నటరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అదనంగా వైజీ మహేంద్రన్, నాడోడిగల్ భరణి, శరవణ సుబ్బయ్య, వేల్ రామమూర్తి, సిరాజ్ జానీ, దినేష్ లాంబా, గణేష్ గౌరంగ్, దివి, దేవయాని శర్మ, అరుణోదయన్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.
Read Also: Tawi Bridge: జమ్మూను ముంచెత్తిన భారీ వర్షాలు.. చూస్తుండగానే కూలిన తావి వంతెన.. షాకింగ్ వీడియో
ఇక, మోహన్. జీ, పద్మ చంద్రశేఖర్ డైలాగ్స్ అందిస్తుండగా, జిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఫిలిప్ ఆర్. సుందర్ సినిమాటోగ్రఫీ, థనికా టోని కొరియోగ్రఫీ, యాక్షన్ సంతోష్, ఎడిటర్ దేవరాజ్, ఆర్ట్ డైరెక్టర్ కమలనాథన్ వంటి ప్రతిభావంతుల బృందం ఈ చిత్రానికి పని చేస్తోన్నారు. అయితే, ఈ సినిమా 14వ శతాబ్దపు చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతోంది. ఆ సమయంలో మొఘల్ చక్రవర్తులు తమిళనాడులోకి ప్రవేశించారు. రక్తంతో రాసిన చారిత్రక ఘట్టాల ఆధారంగా ఈ కథ కొనసాగనుంది. అలాగే, దక్షిణ భారతదేశానికి చెందిన హోయసాల చక్రవర్తి మూడవ వీర వల్లలార్, సేంధమంగలాన్ని పాలించిన కడవరాయుల రాజులు వీరత్వం, త్యాగం, చరిత్రలో చేసిన త్యాగాలను ఈ చిత్రంలో ప్రతిబింబిస్తున్నారు.
Read Also: Ashwin Retirement: సీఎస్కేకు బిగ్ షాక్.. ఐపీఎల్ కు అశ్విన్ గుడ్ బై!
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో 75 శాతం భాగాన్ని ముంబైలో పూర్తి చేశారు. మిగిలిన చిత్రీకరణను సెంజీ, తిరువణ్ణామలై, కేరళలో జరపనున్నారు. 2020లో విడుదలైన ద్రౌపతి సినిమా కథతో ఎలా అనుసంధానమవుతుందో అనేదే ఈ సీక్వెల్‌లో ప్రధానాంశం. అదే కారణంగా ఈ చిత్రం ద్రౌపతి సిరీస్‌లో రెండో భాగంగా రూపుదిద్దుకుంటోంది. ఈ ఏడాది చివరలో భారీ ఎత్తున ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
