యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ – దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా ‘డ్రాగన్’. ఈ మూవీ పై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్‌బస్టర్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నా ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ తో వస్తుండటంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో క్రేజీ ఎక్సైట్‌మెంట్ పెరిగిపోయింది. ఇటీవల ఎన్టీఆర్ లూక్ కూడా అందరిని షాక్ కి గురిచేసింది, లీన్ బాడీ, పుల్ గడ్డం స్టైల్ లో స్టన్నింగ్ లుక్స్‌లో దర్శనమిచ్చాడు. ఈ లుక్ చూసి అభిమానులు చాలా సర్‌ప్రైజ్ అయిపోయారు. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుంది.
Also Read : Kiara Abbavaram : నా పై సింపతీ వద్దు.. కంటెంట్ నచ్చితేనే రండి..
అయితే ‘డ్రాగన్’ ఓటీటీ హకులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా తాజా సమాచారం ప్రకారం ఓటీటీ రీలీజ్ విషయంలో ప్రత్యేక అగ్రిమెంట్ చేసుకుంద మూవీ టీం. ఏంటా అగ్రిమెంట్ అంటే, సినిమా విడుదలైన 8 వారాల తర్వాతే OTT నెట్‌ఫ్టిక్స్ ప్లాట్‌ఫారమ్ లో స్ట్రీమింగ్ చేయలని. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మొత్తానికి, ‘డ్రాగన్’ కోసం అభిమానుల్లో క్రేజీ ఎక్సైట్‌మెంట్, ఎన్టీఆర్ లూక్ OTT రిలీజ్ ప్లాన్ కలిపి సినిమాపై హై అంచనాలు పెంచాయి.
