NTV Telugu Site icon

DoubleiSmart: ప్లీజ్ నాలాగా ఎవరూ చేయకండి : రామ్ పోతినేని

Untitled Design 2024 08 11t121410.386

Untitled Design 2024 08 11t121410.386

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డబుల్ ఇస్మార్ట్. గతంలో వీరి కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు సిక్వెల్ గా రానుంది డబుల్ ఇస్మార్ట్. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి, పూరి జగన్నాధ్ ఈ సినిమాను నిర్మించారు.ఈ సినిమాలో చాక్ లెట్ బాయ్ గా కనిపిస్తున్నాడు రామ్ పోతెనేని. స్కంద సినిమాలో కండలు తిరిగిన రామ్ ని చుసిన ఆడియెన్స్ డబుల్ ఇ’స్మార్ట్’ లుక్ చూసి షాక్ అయ్యారు. ఇంత తక్కువ గ్యాప్ లో స్లిమ్ గా ఎలా మారాడు ఇదెలా సాధ్యమైంది అని ఆరాలు తీయడం మొదలు పెట్టారు.

Also Read: Thangalaan: ‘తంగలాన్’ మొత్తం ఎన్ని భాగాలుగా రానుందో తెలుసా..?

వీటన్నిటికీ సమాధానంగా జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న పిక్స్ షేర్ చేసాడు ఎనర్జిటిక్ స్టార్. ఈ పిక్స్ లో తన తాజా లుక్ కోసం జిమ్, స్టీమ్‌ సెషన్‌లు తీసుకున్నానంటూ రాసుకొచ్చాడు రామ్. అదే విధంగా డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్స్ లో భాగంగా గెటప్ శ్రీనుతో ఇంటర్వ్యూ లో హీరో రామ్ తన లుక్ కు సంబంధించి మరి కొన్ని విషయాలు పంచుకున్నారు. స్కంద పూర్తయ్యేసరికి 86 కిలోల బరువు ఉన్న రామ్, డబుల్ ఇస్మార్ట్ సెట్స్ పైకి వచ్చేసరికి 68 కిలోలకు తగ్గాడు. రామ్ మాట్లాడుతూ ” పూరి జగన్నాథ్ చెప్పిన క్లైమాక్స్ కిక్ ఇచ్చింది. ఇస్మార్ట్ శంకర్ క్లైమాక్స్ లాగే డబుల్ ఇస్మార్ట్ క్లైమాక్స్ లో కూడా షర్ట్ లేకుండా చేయాలని అనుకున్నాం. ఆ క్లైమాక్స్ పార్ట్ నవంబర్ లోనే షూట్ చేయాలి. స్కంద రిలీజైన తర్వాత నాకు 2 నెలలు మాత్రమే టైమ్ ఉంది. దాంతో వెంటనే బాలిలో ఓ ప్రాంతానికి వెళ్లి అక్కడే నెల రోజులుండి తీవ్రంగా వర్కవుట్ చేసి బరువు తగ్గాను” అని రామ్ తెలిపాడు. అయితే ఇలా తక్కువ టైమ్ లో బరువు తగ్గడం ఆరోగ్యానికి ప్రమాదకరమని, తనలా ఎవ్వరూ ప్రయత్నించొద్దని కూడా సూచిస్తున్నాడు ‘బెజవాడ కుర్రోడు రామ్’ .

Show comments