NTV Telugu Site icon

Puri Jagannath: ఎటూ తెగని డబుల్ ఇస్మార్ట్ పంచాయతీ..రంగంలోకి పూరి, ఛార్మి..

Untitled Design (25)

Untitled Design (25)

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రానున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఆగస్టు 15న వరల్డ్ వైడ్ విడుదల కానున్న ఈ చిత్రంఫై అంచానాలు ఉన్నాయి. ఇటీవల విడుడల చేసిన రెండు పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అటు లైగర్ తో పూరి జగన్నాధ్ డిజాస్టర్ ఇచ్చాడు , ఇటు స్కందతో ఫ్లాప్ కొట్టాడు రామ్. ఇద్దరు చెరొక భారీ ఫ్లాప్ తర్వాత వీరి కలయికలో రానున్న ఈ చిత్రంపై హీరో, దర్శకుడు చాలా నమ్మకంగా ఉన్నారు.

కాగా ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలకు గాను రూ.56 కోట్లకు కొనుగోలు చేసారు హనుమాన్ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి. హిందీ రైట్స్ ను రూ.6 కోట్లకు కొనుగోలు చేసారు. కానీ ఈ సినిమా నైజాం విడుదల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. రైట్స్ కొనుగోలు చేసిన నిరంజన్ రెడ్డి మైత్రీ మూవీస్ ద్వారా రిలీజ్ చేయాలని చూడగా సీన్ లోకి ఎంటర్ అయ్యాడు లైగర్ సినిమా డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను. నైజాం తనకు కాకుండా ఎవరికి ఇచ్చినా ఒప్పుకునేది లేదు అని భీష్మించుకూర్చున్నాడు. ఈ నేపథ్యంలో 20% కమిషన్ బేసిస్ వరంగల్ శ్రీను పంపిణి చేసేందుకు మాటలు జరిగాయి. అసలు లైగర్ నష్టాలు ఎంత అనేది లెక్క తేలని కారణంగా మొదటికి వచ్చింది వ్యవహారం. దీంతో లైగర్ నిర్మాతలయిన ఛార్మి, పూరి జగన్నాధ్ నేడు ముంబయి నుండి  హైదరాబాద్ రానున్నారు. మరోసారి పూరి జగన్నాధ్, ఛార్మి, వరంగల్ శ్రీను, మైత్రీ మూవీస్ సమక్షంలో పంచాయతీ జరగనుంది. మరి విడుదలకు 14 రోజులు ఉండగా ఈ పంచాయతీలు ఏమిటో అని రామ్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.