Double Ismart Censor: రామ్ పోతినేని, పూరి జగన్నాథ్, కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం “డబుల్ ఇస్మార్ట్”. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాతలు నిరంజన్ రెడ్డి & చైతన్య రెడ్డి ఉస్తాద్ పూరి కనెక్ట్స్ డబుల్ ఇస్మార్ట్ యొక్క 5 భాషల ప్రపంచవ్యాప్త పంపిణీ హక్కులు కొనుగోలు చేశారు. ఇస్మార్ట్ శంకర్ తరువాత మల్లి వీళ్ళ ఇద్దరి కాంబినేషన్‌లో మూవీ రావడంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్ మీద జనాలలో ఆసక్తి ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసినఈ సినిమా పోస్టర్‌లు, టీజర్ మరియు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ కి కూడా మంచి స్పందన లభిస్తుంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఐదు భాషలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి గురువారం (స్వాతంత్ర్య దినోత్సవం), సోమవారం (రక్షా బంధన్) సెలవులతో 5 రోజుల సుదీర్ఘ వీకెండ్ వలన మంచి కలెక్షన్లు వస్తాయని భావిస్తున్నారు చిత్ర యూనిట్.
Also Read: Yash : మరో చాప్టర్ మొదలుపెట్టిన కెజిఎఫ్ స్టార్ యష్.. దర్శకుడు ఎవరంటే..?
పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరి జగన్నాధ్ – ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమాలో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటించగా, రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. అలీ, గెటప్ శ్రీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. ఫుల్ యాక్షన్ తో తెరకెక్కిన ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి ( ఎ) సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది.. అలాగే ఈ మూవీ రన్ టైం 2 గంటల 42 నిమిషాలు ఉన్నట్లు సమాచారం. భారీ బ్లాక్‌బస్టర్ ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రంలో మాస్, యాక్షన్, డ్రామా మరియు వినోదం యొక్క డబుల్ డోస్ ఉంటుందని అంటున్నారు.