NTV Telugu Site icon

సల్మాన్ స్ట్రాటజీ వర్కవుట్ అవుతుందా!?

Does Salman Strategy workout for Radhe ?

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. ప్రత్యేకించి పలువురు చిత్ర ప్రముఖులు కూడా కరోనా మహమ్మారికి బలయ్యారు. అవుతున్నారు. చిత్రపరిశ్రమ దాదాపుగా మూత పడింది. నార్త్ నుంచి సౌత్ వరకూ మొత్తం సినిమా ఇండస్ట్రీ స్థంబించి పోయింది. తెరిచి ఉన్న అర కొర థియేటర్లలో సినిమాలు నడుస్తున్నా…. ప్రేక్షకులు కరువవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద సినిమాలు ఏవీ విడుదల చేయటానికి ఏ దర్శకనిర్మాతా ధైర్యం చేయటం లేదు. అయితే ఈటైమ్ లో కూడా బాలీవుడ్ బడా హీరో సినిమా రిలీజ్ అవుతోంది. ఆ హీరో సల్మాన్ ఖాన్. సినిమా ‘రాధే’. రంజాన్ పండగ కానుకగా మే 13న ఆడియన్స్ ముందుకు వస్తోంది. ‘రాధే’. దేశంలో మూడొంతుల సినిమా థియేటర్లు మూసి ఉన్న టైమ్ లో సల్మాన్ ఎందుకు రిలీజ్ కి వస్తున్నాడనే సందేహం చాలా మందిలో ఉంది.

సల్మాన్ స్ట్రాటజీ
అయితే ఈ విషయంలో సల్మాన్ స్ట్రాటజీ వేరే ఉందట. ‘రాధే’ను థియేట్రికల్ రిలీజ్ తో పాటు ఓటీటీలోనూ విడుదల చేయబోతున్నారు. అదీ పే ఫర్ వ్యూ పద్ధతిలో. చాలా చోట్ల ప్రజలు లాక్ డౌన్ తో ఇళ్ళకే పరిమితం అయి ఉన్నారు. ఈటైమ్ లో టైమ్ పాస్ కి సినిమాయే మార్గం. కొత్త సినిమా… అదీ సల్మాన్ సినిమా అంటే డబ్బుకి వెనుకాడకుండా చూసేస్తారు. ఇదేకాదు సల్మాన్ టార్గెట్ వేరే ఉందట. అదే ఓవర్సీస్. బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉంది. సల్మాన్ అక్కడ దృష్టి పెట్టాడట. కరోనా వచ్చిన తర్వాత ఏ బడా హిందీ సినిమా రిలీజ్ కాకపోవడం ‘రాధే’కు పెద్ద ప్లస్ పాయింట్. సో భారీ వసూళ్ళు వస్తాయని ఆశిస్తున్నారు. ఇండియా కాకుండా ఇతర ప్రపంచ దేశాల్లో కరోనా ప్రభావం అంతంత మాత్రం కావటం కలసి వచ్చే అంశం. ఇండియాలో ఓటీటీ ద్వారా ఓవర్సీస్ లో థియేట్రికల్ రిలీజ్ ద్వారా లబ్దిపొందాలని ప్లాన్ వేసింది ‘రాధే’ యూనిట్. మరి వారి ప్లాన్ ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.