ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.. కృష్ణా జిల్లా కంకిపాడులో 1942, జులై 10న జన్మించిన కోట శ్రీనివాసరావు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి ఆహా నా పెళ్లంట సినిమాతో తిరుగులేని నటుడిగా మారారు. ప్రతిఘటన చిత్రంలో విలన్గా మంచి గుర్తింపు పొందిన కోట శ్రీనివాసరావు సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంకులో పని చేసేవారు. ఆయన విలక్షణమైన నటనకు గాను 2015లో కోట శ్రీనివాసరావుకు పద్మశ్రీ పురస్కారం వరించింది.9 నంది అవార్డులు అందుకున్న కోట.. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు.
Also Read : KOTA : కోట శ్రీనివాసరావుకు చిరు, బాలయ్య ఘన నివాళి..
అయితే కోట శ్రీనివాసరావు సినిమాల్లోకి రాకముందు నుండి టాలీవుడ్ ప్రముఖ హీరో మురళి మోహన్ కు బాగా పరిచయస్తులు. బ్యాంకులో పనిచేసే అప్పుడు కూడా మురళి మోహన్ తో సినిమా పరిశ్రమల గురించి మాట్లాడేవారట కోట. అలా సినిమాల్లోకి వచ్చిన తర్వాత కోట మురళి మోహన్ తో ఎన్నో సినిమాలలో కలిసి నటించారు. అలాగే ఆయన సొంత సంస్థ జయభేరి సంస్థలో కూడా చాలా సినిమాలలో నటించారు. అలా మురళి మోహన్ ఇచ్చిన డబ్బులతోనే మొదటిసారి ఫ్లైట్ ఎక్కారట కోట. ఆ విషయాన్నీఅనేక సందర్భాలలో మురళీ మోహన్ తో కలిసి పంచుకుంటూ సరదాగా సంభాషించే వారట. వందల సినిమాలలో నటించి మెప్పించిన కోట లాంటి మంచి మిత్రుని కోల్పోయానని మురళి మోహన్ భావోద్వేగానికి గురయ్యారు.
