తాజాగా ‘తండేల్’ మూవీతో దెబ్బ అదుర్స్ అనిపించాడు నాగచైతన్య. ఇప్పటి వరకు వరుస డిజాస్టర్స్ తో సతమతమైన చై ఈ మూవీతో ఒడ్డున పడ్డాడు. బిగినింగ్ నుంచి తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడానికి ఎంతగానో ప్రయత్నించారు నాగచైతన్య. మొత్తానికి ఈ ‘తండేల్’ మూవీలో ప్రాణం పెట్టి నటించి తనను తాను నిరూపించుకున్నాడు. అందుకే బాక్సాఫీస్ వద్ద ఎన్ని సినిమాలు దిగుతున్నా.. ‘తండేల్’ మాత్రం పక్కకు జరగడం లేదు. మొదటి రోజు నుండే బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ఈ మూవీ కలెక్షన్ల పరంగా సత్తా చాటుతుంది. ఇక ఇప్పుడు నాగచైతన్య తన తదుపరి చిత్రాన్ని కార్తీక్ వర్మ దండుతో తీయబోతున్నాడు.
Also Read:Naveen Polishetty: అగ్ర హీరోలతో పోటీకి సిద్ధం అవుతున్న నవీన్ పొలిశెట్టి..!
‘వీరూపాక్ష’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు కార్తీక్ వర్మ. ఈ మూవీ తో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కథ ప్రకారం భయానకంగా బాగా చూపించాడు కార్తీక్. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు నాగచైతన్య తో చేయబోతున్న సినిమా కూడా సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్ట్ రాబోతున్నట్లు సమాచారం.అంతేకాదు కార్తీక్ వర్మ.. నాగచైతన్య ను ఒక కొత్త జోనర్ లో చూపించబోతున్నాడట. దీని గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలకు కమిట్ అయాడు నాగచైతన్య . కానీ ఆ సినిమాలకు దర్శకులు ఎవరు అనే విషయాన్ని తొందర్లోనే తన అభిమానులకు తెలియజేస్తారట. మొత్తానికి చై తన కెరీర్ పై పూర్తి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.