ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ దశదిన కర్మను సోమవారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లతో పాటుగా రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ ఇలా మెగా హీరోలంతా అల్లు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ తన తల్లి గురించి ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. పరిపూర్ణమైన జీవితాన్ని గడిపిన అల్లు కనకరత్నమ్మ గురించి ఆయన ఇంకేం చెప్పారంటే..
Also Read : Siddhu Jonnalagadda : తెలుసు కదా.. టీజర్ డేట్ తెలుసా మాస్టారు
‘మా అమ్మ ఇహలోకాల్ని వదిలి పరలోకాలకు ప్రయాణించే మొదటి రోజుని సంతోషంగా నిర్వహించాం. మా అమ్మ 11వ రోజుని సెలెబ్రేట్ చేశాం. అలా ఎందుకు సెలెబ్రేట్ చేశామన్న వివరణ అందరికీ ఇవ్వాలని అనిపించింది. మా తల్లి చనిపోయినప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కొంత బాధపడ్డాం. మా తల్లి మా నుంచి విడిపోయిందని బాధపడ్డాం కానీ ఓ రెండు గంటల తరువాత దాన్నుంచి బయటకు వచ్చాం. మా తల్లిని సంతోషంగా సాగనంపాలని నిర్ణయించుకున్నాం. నాకు తెలిసి ఇటువంటి ఈ 94 ఏళ్ల సుదీర్ఘమైన జీవితం ఎవ్వరికీ కలిగి ఉండకపోవచ్చు. వెయ్యి చిత్రాలకు పైగా నటించిన అల్లు రామలింగయ్య భార్యగా జీవితాన్ని సాగించారు. ఆమె కన్నవారిలో నేను ఉన్నాను. నా గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. మెగాస్టార్, గొప్ప మానవతావాది లాంటి చిరంజీవి గారిని అల్లుడిలా పొందారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన అల్లు అర్జున్, రామ్ చరణ్, అల్లు శిరీష్, అల్లు వెంకటేష్ వంటి మనవళ్లను చూశారు. పవన్ కళ్యాణ్ బాబు సినిమాల్లోకి రాకముందు.. మా అమ్మ ‘కళ్యాణీ’ అని పిలుస్తుండేవారు. నువ్వు బాగున్నావ్ అందంగా ఉన్నావ్ సినిమాల్లో నటించొచ్చు కదా అని ఆమె చెబుతుండేవారు. కళ్యాణ్ చక్కగా ఉన్నాడు సినిమా తీయొచ్చు కదా అని నాతో కూడా మా అమ్మ చెబుతుండేవారు. చిరంజీవి ఎంత మెగాస్టార్ అయినా కూడా కుటుంబ సభ్యుల వద్ద ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే’ అనిఅన్నారు.
