NTV Telugu Site icon

Prabhas :ప్రభాస్ స్టంట్ అంత పర్ఫెక్ట్ గా రావడానికి కారణం ఏంటో తెలుసా?

Bhairava

Bhairava

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ మూవీ “కల్కి 2898 AD “.స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కించారు.వైజయంతి మూవీస్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న ఎంతో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.దీనితో మేకర్స్ ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టేసారు.ఈ సినిమాలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపిస్తున్నాడు.అయితే ఈ సినిమాలో భైరవకు ఓకే మిత్రుడు ఉంటాడు.తానే “బుజ్జి”..అస్సలు బుజ్జి ఎవరంటే ఈ సినిమాలో భైరవ వాడే కార్ పేరు.ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాల కోసం భైరవకు బుజ్జి సహాయ పడుతుంది.

Read Also :Prabhas : ప్రభాస్ కి పోలీసుల హై సెక్యూరిటీ.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..

ఈ బుజ్జికి మహానటి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది.ఈ సినిమాలో బుజ్జి పాత్ర ఎంతో సరదాగా ఉంటుంది అని సమాచారం.ఇదిలా ఉంటే ఈ బుజ్జిని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు మేకర్స్ మే 22 న రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ ఏర్పాటు చేసారు .ఈ ఈవెంట్ లో ప్రభాస్ అభిమానులు భారీగా పాల్గొన్నారు.బుజ్జి కోసం ఎంతగ్నో ఎదురు చూస్తున్న అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇస్తూ ప్రభాస్ ఓ భారీ స్టంట్ చేస్తూ బుజ్జి తో మాస్ ఎంట్రీ ఇచ్చాడు.ప్రభాస్ ఎంట్రీ చూసి ప్రేక్షకులు ఆశ్చర్య పోయారు.అయితే ఈ స్టంట్ పర్ఫెక్ట్ గా రావడం కోసం మాస్ ఎంట్రీ కోసం ప్రభాస్ దాదాపు మూడు రోజుల నుండి 5 గంటల చొప్పున ప్రాక్టీస్ చేసినట్లు సమాచారం.