గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ బాబీ పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ మాత్రం బాలయ్య ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. ఇక చిన్ని అంటూ వచ్చిన సెకండ్ సాంగ్ ఎమోషనల్ టచ్‌తో సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అసలు బాలయ్య అంటేనే ఊగిపోయే తమన్ మరోసారి తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్ బాక్సులు బద్దలు చేయడం గ్యారెంటీ అని నిర్మాత నాగవంశీ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు.
Also Read : Child Artists : సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్న చైల్డ్ ఆర్టిస్టులు..
అయితే తమన్ బాదుడుకి థియేటర్లలో బాక్సులు ఎన్నిగంటలు మోత మోగుతాయనే విషయంలో ఇప్పుడో క్లారిటీ వచ్చింది. లేటెస్ట్‌గా డాకు మహారాజ్ రన్ టైం లాక్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా ఫైనల్ రన్‌టైమ్ వచ్చేసి 2 గంటల 24 నిమిషాలకు లాక్ చేసినట్లుగా సమాచారం. మొత్తంగా టైటిల్ క్రెడిట్స్, హెల్త్ వార్నింగ్ మెసేజ్‌లు కలుపుకుని 2 గంటల 32 నిమిషాల రన్ టైంతో డాకు మహారాజ్ రిలీజ్ కానుందని సమాచారం. అంటే.. దాదాపు రెండున్నర గంటలు బాలయ్య మాస్ జాతరకు, తమన్ తాండవానికి థియేటర్ టాపులు లేచిపోవడం గ్యారెంటీ అనే చెప్పాలి. త్వరలోనే ఈ రన్ టైం పై మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా.. సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.