NTV Telugu Site icon

Malvi Malhotra: మాల్వి మల్హోత్రా పై హత్యాయత్నం.. ఏకంగా మూడు కత్తి పోట్లు.. ఎందుకో తెలుసా?

Malvi Malhotra Attacked

Malvi Malhotra Attacked

Do you Know about Attack on Malvi Malhotra by Knife: హీరో రాజ్ తరుణ్ తో ఎఫైర్ పెట్టుకుందని ఆయన తిరగబడరా సామి హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య ఈ మేరకు కేసులు కూడా పెట్టింది. మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ నడుపుతున్న రాజ్ తరుణ్ నన్ను వదిలించుకోవాలని చుస్తున్నాడని, శారీరకంగా వాడుకుని మోసం చేశాడని కూడా కేసులలో పేర్కొంది. గుడిలో మాకు రహస్య వివాహం జరిగిందని ఆ తరువాత రాజ్ తరుణ్ రెండుసార్లు అబార్షన్ కూడా చేయించాడని ఆమ్ అంటోంది. లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, ఆమె తమ్ముడు మయాంక్ మల్హోత్రాను ఏ వన్, ఏ టు, ఏ త్రీగా నమోదు చేశారు. రాజ్ తరుణ్ కి నోటీసులు కూడా జారీ చేశారు.

Kamal Haasan: వరుస కాల్స్ వస్తున్నాయి.. ఇలా అవుతుందని అనుకోలేదు.. వీడియో రిలీజ్ చేసిన కమల్

అయితే గతంలో మాల్వి మల్హోత్రా అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేష్ తో ఎఫైర్ నడిపిందని, ఇద్దరికి మనస్పర్థలు రాగా మాల్వి మల్హోత్రా పై యోగేష్ కత్తితో దాడి చేయగా ఈ దాడిలో మాల్వి మల్హోత్రా గాయాలపాలైంది. యోగేష్ మర్డర్ అటెంప్ట్ కేసులో అరెస్ట్ అవగా ఇప్పుడు యోగేష్ తల్లి మాల్వి మల్హోత్రా మీద కేసు పెట్టింది. మాల్వి మల్హోత్రా ప్రేమ పేరుతో నా కొడుకు యోగేష్ ని ట్రాప్ చేసి, ఆస్తులు కాజేసి జైలుపాలు చేసిందని కంప్లైంట్ లో పేర్కొంది. 2020 అక్టోబర్‌లో ముంబయిలోని అంధేరి ప్రాంతంలో మాల్వీ మల్హోత్రాపై దాడి జరిగింది. ఆమె మీద దాడి చేసిన యువకుడి పేరు యోగేష్ మహిపాల్ సింగ్. పెళ్లి కోసం యోగేష్ ఒత్తిడి చేయగా నటి నిరాకరించడంతో కత్తితో పొడిచి పారిపోయాడు. తీవ్రమైన గాయాలతో మాల్విని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేర్చవలసి వచ్చింది, అక్కడ ఆమె వేలికి శస్త్రచికిత్స కూడా జరిగింది. అప్పట్లో మాల్వీ ఫిర్యాదు ప్రకారం, ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ ద్వారా నిందితుడు యోగేష్‌ను కలుసుకుంది. ఫేస్‌బుక్‌లో ఒకరినొకరు పరిచయం చేసుకున్న తర్వాత, మాల్వి ఒకసారి యోగేష్‌ను పని కోసం ఒక కేఫ్ హౌస్‌లో కలిశారట.

Show comments