టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని,డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పటివరకు ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న రామ్ ,పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు.అయితే ఈ సినిమా తర్వాత ఈ ఇద్దరు కూడా మరో సూపర్ హిట్ అందుకోలేకపోయారు .దీనితో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టేందుకు ఈ క్రేజీ కాంబో మరోసారి రిపీట్ అయింది.వీరిద్దరి కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ మూవీ తెరకెక్కుతుంది..
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.అయితే ఈ మధ్య కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయిందని వార్తలు వచ్చినా కూడా ఇప్పుడు తిరిగి సెట్స్ పైకి వెళ్లడానికి చిత్ర యూనిట్ సిద్ధం అవుతున్నారు. అంతేకాదు.. త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు కూడా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇస్మార్ట్ శంకర్ సినిమా మ్యూజికల్ హిట్‌గా కూడా నిలిచింది.ఈ సినిమా హిట్ కావడానికి ప్రధాన కారణం మ్యూజిక్ .మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఇచ్చిన మాస్ బీట్స్‌కు డీజె బాక్సులు బద్దలైపోయాయి. ఇస్మార్ట్ శంకర్ లోని ప్రతి సాంగ్ తో మణిశర్మ మాస్ డ్యాన్స్ చేయించాడు .ఇక ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ కోసం అంతకుమించి మాస్ బీట్స్ తో మణిశర్మ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ వేసిన పూరి ఈ మూవీ నుండి మే 15న ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసేందుకు సిద్ధం అయినట్టు సమాచారం. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని తెలుస్తుంది.
