Ranveer Singh: బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే విడాకులు తీసుకోబోతున్నారట.. అనే వార్త గత కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పదేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మధ్య గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయని, త్వరలోనే ఈ జంట విడాకులు తీసుకోబోతుందని ఉమైర్ సంధు అనే వ్యక్తి ట్వీట్ చేయడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇక దీపికా ఇటీవలే హాస్పిటల్ కు వెళ్లి రావడంతో ఆమె గర్భవతి కాబోతుందన్న స్వీట్ న్యూస్ చెప్తారనుకుంటే.. విడాకుల వార్తలు ఏంటని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వార్తలపై ఎట్టకేలకు రణ్‌వీర్ సింగ్ స్పదించాడు.
ఒక ఇంటర్వ్యూలో రణ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ ఈ విడాకుల వార్తలను ఖండించాడు. తామిద్దరూ 2012 లో కలుసుకున్నామని, అప్పటినుంచి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నామని, ఈ పదేళ్లలో దీపికాపై ఉన్న ప్రేమ పెరిగిందే కానీ తరగలేదని చెప్పుకొచ్చాడు. మా మధ్య విబేధాలు లేవని, తాము ఇద్దరం ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నామని చెప్పాడు. అంతేకాకుండా త్వరలోనే మా నుంచి మీకొక గుడ్ న్యూస్ రాబోతుందని, తమని మళ్లీ జంటగా చూడబోతున్నట్లు చెప్పుకొచ్చాడు. అంటే త్వరలో ఈ జంట కలిసి ఒక సినిమాలో నటించనున్నారట. ఇక రణ్‌వీర్ సింగ్ క్లారిటీతో ఈ పుకార్లకు చెక్ పడినట్లు అయ్యింది. ఇకపోతే ప్రస్తుతం రణ్‌వీర్ పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా మారగా.. దీపికా ప్రాజెక్ట్ కె, పఠాన్ సినిమాలతో బిజీగా ఉంది.
