NTV Telugu Site icon

Anirudh: ఆయన కోసం పడిగాపులు కాస్తున్న దర్శకులు..

Anirudh

Anirudh

భాషతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో నంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు అనిరుధ్. అనతి కాలంలోనే తన టాలెంట్ తో విశ్వరూపం చూపించాడు. అలా తమిళంలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తెలుగు ప్రాజెక్టులు ఏవైనా క్రేజీవి వస్తే వద్దనడం లేదు. కానీ సమాచారం ప్రకారం టాలీవుడ్ మూవీస్‌కి అనుకున్న టైం‌మ్‌కి అనుకున్నట్లుగా వర్క్ చేయించుకోలేకపోతున్నాడట అనిరుధ్. దీంతో  డైరెక్టర్‌లు ఇబ్బంది పడుతున్నారట. ఇందులో భాగంగా నాని ది ప్యారడైజ్ లాంచింగ్ ప్రోమోని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఎప్పుడో సిద్ధం చేసి ఉంచాడట. అయితే దీనికి ఇంకా బెస్ట్ స్కోర్ కావాలి. కానీ  అనిరుధ్ మీద ఒత్తిడి చేయలేని పరిస్థితి. అందుకే అతని కోసం టీమ్ ఓపిగ్గా ఎదురు చూస్తోంది. అతను కంపోజ్ చేసి ఫైనల్ అయ్యాక డేట్ ప్రకటిస్తారట.. అప్పటి వరకు వెయిటింగ్ తప్పదంటున్నారు.

దీంతో పాటు విజయ్ దేవరకొండ ‘12 VD’ ఇదే పరిస్థితి. గౌతమ్ తిన్ననూరితో అనిరుధ్‌కు మంచి బాండింగ్ ఉంది. అయినా సరే షెడ్యూల్ కుదరకపోవడం వల్ల అనుకున్న టైంకి అనిరుద్ అవుట్ ఫుట్ ఇవ్వలేకపొతున్నాడు. లేకపోతే ఇప్పటికే టైటిల్ టీజర్ రిలీజ్ చేసి ఉండేవారంట. అయితే తాజాగా వైరల్ అవుతున్న విషయం ఏంటి అంటే.. రజినీకాంత్ ‘జైలర్ 2’ మూవీ అనౌన్స్ మెంట్ వీడియోలో, నటించి మరీ దానికి పని చేసిన అనిరుధ్, తెలుగు సినిమాలపై మాత్రం అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని టాక్ నడుస్తుంది.

కానీ ‘దేవర’ సినిమాకి అతను అందించిన మ్యూజిక్ విన తర్వాత వేచి చూడటంలో తప్పులేదు అనే ఉద్దేశంలో ఉన్నరట టాలీవుడ్ డైరెక్టర్‌లు. బాలకృష్ణ – గోపీచంద్ మలినేని, చిరంజీవి- శ్రీకాంత్ ఓదెల సినిమాలకు కూడా అనిరుధ్ నే అడుగుతున్నారు కానీ ఇంకా ఎస్ చెప్పలేదట. కానీ ఈ సినిమాలకి వర్క్ చేయాలని ఉందని, ఎట్టి పరిస్థితుల్లో వదులుకోనని వాటి నిర్మాతలకి మాటిచ్చడట అనిరుధ్.