Site icon NTV Telugu

Sujith : ఏకంగా సచిన్ ను డైరెక్ట్ చేసిన సుజిత్?

Techno Paints

Techno Paints

యువ దర్శకుడు సుజీత్ ఈ సంవత్సరంలో ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సాధించాడు. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన డైరెక్టర్‌గా సుజీత్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. వాస్తవానికి, సుజీత్ పవన్ కళ్యాణ్ అభిమానిగా తన సత్తాను నిరూపించుకున్నాడు. ఓజీ తరువాత ఈ యంగ్ డైరెక్టర్ నానితో ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే సుజీత్ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

Also Read :Reble Star : అంచనాలు పెంచేస్తున్న హను.. ప్రభాస్ కెరిర్ బెస్ట్ ఫిల్మ్ గా ‘ఫౌజీ’

ఈ గ్యాప్‌లో ఖాళీగా ఉండకుండా సుజీత్ యాడ్ షూట్‌లు చేస్తున్నాడు. అందులో భాగంగానే, టెక్నో పాయింట్స్ యాడ్ చిత్రీకరణ కోసం ఏకంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో జతకట్టాడు. సచిన్ యాడ్‌ను సుజీత్ డైరెక్ట్ చేయబోతున్నాడనే వార్తలు గతంలోనే వచ్చాయి. తాజాగా ఈ యాడ్ షూట్ పూర్తయినట్లు తెలుస్తోంది. షూట్‌లో సచిన్‌కు సీన్‌ను వివరిస్తున్న ఫోటోలను సుజీత్ తన సోషల్ మీడియా ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. అంతేకాకుండా, ‘మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌తో అద్భుతమైన క్షణాలు’ అంటూ ఒక క్యాప్షన్ కూడా రాశాడు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వాణిజ్య ప్రకటన త్వరలోనే విడుదల కానుంది.

Exit mobile version