జెంటిల్‌మన్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, రోబో వంటి సినిమాలతో తనదైన ముద్ర వేసుకున్న లెజెండరీ డైరెక్టర్ శంకర్, టెక్నికల్ పరంగా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని తీసుకొచ్చే దర్శకుడిగా గుర్తింపు పొందారు. భారతీయ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌కి తీసుకెళ్లిన అతని ప్రయోగాత్మక దృష్టికోణం ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంది. ఇప్పుడు ఆయన మరోసారి తన కలల ప్రాజెక్ట్‌తో ముందుకొస్తున్నారు.
Also Read : Peddhi : ‘పెద్ది’ నుండి శివ రాజ్‌కుమార్ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ విడుదల..!
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “ఒకప్పుడు రోబో నా డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే, ఇప్పుడు ‘వేళ్పారి’నే నా కలల సినిమా” అని పేర్కొన్నారు. ఈ సినిమా భారీ స్థాయిలో “ఆవతార్”, “గేమ్ ఆఫ్ థ్రోన్స్” తరహాలో టెక్నాలజీని పరిచయం చేసే అవకాశం ఈ ప్రాజెక్ట్‌లో ఉంది’ అని అన్నారు. అయితే ఈ ప్రకటనతో పాటు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపిస్తుంది. “మళ్లీ శంకర్ డబ్బులు వృథా చేయబోతున్నారు”, “ఇంకా 24 గంటల ఫుటేజ్ తీస్తారట” అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కానీ అదే సమయంలో, ఆయన టెక్నికల్ విజన్‌పై ఇంకా భారీ నమ్మకం పెట్టుకున్న అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో శంకర్ మళ్లీ తన పాత ఫామ్‌ను తిరిగి సంపాదించగలరా?, లేక ఈసారి ప్రేక్షకుల అంచనాలకు తగ్గ ఫలితం రానుందా? అనేది త్వరలోనే తేలనుంది.
