Site icon NTV Telugu

గన్ను పట్టుకుని బయలుదేరిన ధనుష్ అన్నయ్య!

‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ లాంటి హిట్ మూవీతో తెలుగు వారికి కూడా బాగానే పరిచయమైన దర్శకుడు సెల్వరాఘవన్. అయితే, కోలీవుడ్ లో ఆయన ఇంటెన్స్ మూవీస్ కి బోలెడు క్రేజ్ ఉంది. అక్కడ మంచి డిమాండ్ ఉన్న డైరెక్టర్ ఆయన. అయితే, కొన్నాళ్ల క్రితం తెర మీద కనిపించబోతున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. నటుడిగా సెల్వరాఘవన్ తొలి చిత్రం ‘సాని కాయిదమ్’లో కీర్తి సురేశ్ కనిపించబోతోంది. టాలెంటెడ్ డైరెక్టర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నందుకు ఆమె సంతోషం వ్యక్తం చేసింది.
‘సాని కాయిదమ్’ మూవీ పోస్టర్ లో కీర్తీ సురేశ్ టోటల్ డీ గ్లామరైజ్డ్ లుక్ , గ్రామీణ స్త్రీ లాంటి చీరకట్టుతో అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమెతో బాటూ సెల్వరాఘవన్ కూడా మాసిన బట్టలు, పెద్ద పెద్ద అద్దాలతో నెటిజన్స్ లో ఎక్కడలేని ఇంట్రస్ట్ క్రియేట్ చేయగలిగాడు. అయితే, తాజాగా మరో ఇంటెన్స్ ఇమేజ్ ని వదిలాడు సెల్వరాఘవన్. ఈసారి గన్ పట్టుకుని సీరియస్ గా ఫోజిచ్చాడు. రక్తపు మరకలతో ‘సాని కాయిదమ్’ లెటెస్ట్ పిక్ అందరిలోనూ ఆసక్తి రేపుతోంది!
చూడాలి మరి, ఇంత కాలం దర్శకుడిగా సత్తా చాటిన క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ నటుడిగా ఏం చేస్తాడో! ధనుష్ లాంటి స్టార్ హీరోకు అన్నయ్యగా ఆడియన్స్ అంచనాల్ని అందుకుంటాడో లేదో…

Exit mobile version