Site icon NTV Telugu

త్వరలోనే ‘రాజుగారి గది 4’!

బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తున్న ఓంకార్‌ ‘జీనియస్‌’ సినిమాతో దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. ఆతర్వాత ‘రాజుగారి గది’ సినిమాతో ఆయనకి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాకు సీక్వెల్స్‌ ప్లాన్ చేసి సక్సెస్ అయ్యాడు. రెండో సీక్వెల్ గా తన తమ్ముడు అశ్విన్‌, హీరోయిన్‌ అవికా గోర్‌ ప్రధాన పాత్రల్లో ‘రాజు గారి గది 3’ సినిమా రూపొందించాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టు కోలేదు. అయితే చాలా రోజుల తరువాత ఈ సీక్వెల్స్ పై స్పందించిన ఓంకార్‌ ‘రాజు గారి గది 4’ కథ సిద్ధంగా ఉందంటున్నాడు. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని.. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేయనున్నట్లు తెలిపాడు.

Exit mobile version