NTV Telugu Site icon

కోవిడ్ పేషెంట్స్ కోసం ఆశ్రమం ప్రారంభించిన డైరెక్టర్ లింగుస్వామి

Director Linguswamy Opens Ashram for Covid-19 Patients

కరోనా వైరస్ సెకండ్ వేవ్ లో వైరస్ తీవ్రత పెరగడమే కాకున్నా వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా బారిన పడిన వారు ఆసుపత్రులలో పడకలు లేకపోవడం, ఆక్సిజన్ కొరత వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలతో కరోనా కేసులు కొద్దిగా తగ్గాయి. కరోనావైరస్ సంబంధిత సహాయ నిధి కోసం రాజకీయ పార్టీ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు మరియు అన్ని వర్గాల ప్రజలు తమిళనాడు ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. వైరస్‌తో పోరాడుతున్న వారి చికిత్సకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. తాజాగా ప్రముఖ దర్శకుడు లింగుస్వామి కరోనా రోగుల కోసం ఒక ఆశ్రమాన్ని ప్రారంభించారు. మనప్పక్కంలో ప్రారంభించిన ఆశ్రమాన్ని ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు. మంత్రి టిఎం అన్బరసన్, నటుడు కీర్తి సురేష్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఇక సౌత్ లో పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఈ దర్శకుడు ఇటీవల పరిశ్రమలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం ఎనర్జిటిక్ హీరో రామ్‌తో కలిసి తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నాడు లింగుస్వామి.