NTV Telugu Site icon

నీ బిహేవియర్ కు ఇండస్ట్రీ గేట్ లోకి రాలేవు అన్నారు : బీవీఎస్ రవి

BVS Ravi

BVS Ravi

ప్రముఖ టాలీవుడ్ రచయిత, దర్శకుడు, నిర్మాత బీవీఎస్ రవి తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆయన చేసిన ఆసక్తికర కామెంట్స్ గురించి నెట్టింట్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రోమోలో మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ బీవీఎస్ రవిని సంతోషం అధినేత సురేష్ కొండేటి ఇంటర్వ్యూ చేశారు. ఇండస్ట్రీలోకి చాలా తొందరగా ఎంట్రీ ఇచ్చినట్టున్నారు ? అని సురేష్ కొండేటి అడగ్గా… “22 సంవత్సరాలకు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను. దానికి ప్రధాన కారణం కొరటాల శివ, శివ వాళ్ళ మామయ్య పోసాని కృష్ణమురళీ గారు. కాలేజీ రోజుల్లో సెలవుల సందర్భంగా హైదరాబాద్ వచ్చినప్పుడు కలిశాను. నీ బిహేవియర్ కి ఇండస్ట్రీ గేట్ లోకి రాలేవు అన్నారాయన. నేను ఇండస్ట్రీకి గేట్లు లేవు సర్… ఎవడైనా రావొచ్చు… ఎవడైనా పోవచ్చు అన్నాను” అని రిప్లై ఇచ్చారు. ఒక సక్సెస్ ఫుల్ మూవీలో రచయిత పాత్ర ఎంత మేరకు ఉంటుంది ? అని ప్రశ్నించగా… “100 శాతం ఉంటుంది. ఇది నిజం…” అని అన్నారు.

Read Also : ‘బెర్లిన్’లో ‘ఫెస్టివల్’… కరోనా కోరల్లోంచి యూరోపియన్ సినిమా ఔట్!

మీ క్లాస్ మేట్, రూమ్ మేట్ ఒక్క ఫెయిల్యూర్ కూడా లేకుండా ఇంత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా అవ్వడం గురించి మీరేం చెప్తారు అనే ప్రశ్నకు… “ఇందులో ఆశ్చర్యం లేదు… ఎందుకంటే ఇదే జరుగుతుందని నాకు ముందే తెలుసు” అని సమాధానం ఇచ్చారు. ఆయనలో 10% కూడా సక్సెస్ కాలేకపోయాను అనే భావన మీకెప్పుడైనా కలిగిందా ? అంటే… “తనకున్న టార్గెట్, నా టార్గెట్ డిఫరెంట్” అని చెప్పుకొచ్చారు బీవీఎస్ రవి. పారితోషికం మాత్రం మీకిచ్చి… వాళ్ళ పేర్లు వేసుకున్న సందర్భాలు?.. “నాలుగు సినిమాలు చేశాను.. ఎందుకు చేశానో కూడా చెబుతా..” అని ఆయన అనడం వీడియోలో చూడొచ్చు. మీరు కూడా డైరెక్టర్ గా చేశారు కదా… కొంతమంది మీరు రచయితగా రాసినప్పుడు అందులో మార్పులు చేర్పులు చెప్పడం లాంటి సంఘటనలు జరిగినప్పుడు మీకేం అన్పిస్తుంది ? అని సురేష్ అడగ్గా.. నేను 100% కమిటెడ్ గా రైటర్ గానే బిహేవ్ చేస్తాను. ఎందుకంటే నేను ప్రూవ్డ్ ఫ్లాప్ డైరెక్టర్ ని… నేను చేసింది వాళ్లకు నచ్చలేదు” అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇక మీరు చాలామంది హీరోల దగ్గర పని చేశారు. పవన్ కళ్యాణ్ గురించి? అని సురేష్ కొండేటి మరో ప్రశ్న సంధించగా… “ఆయన చాలా లోతైన మనిషి.. మనసులో ఆలోచనలు దొంతరలు దొంతరలుగా ఉంటాయి” అని అన్నారు. ఇక మెగాస్టర్ చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి మాట్లాడుతూ “ఇంపాజిబుల్ టాస్క్ ను ఆయన చేస్తున్నారు. చాలా కష్టపడుతున్నాడాయన. ఎవరి వల్ల కానిది ఆయన వల్ల అవుతుంది” అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.

ఇక బీవీఎస్ రవి విషయానికొస్తే… శివయ్య, సీతారామరాజు, ప్రేయసి రావే, స్నేహితులు, అయోధ్య రామయ్య, భద్రాచలం తదితర చిత్రాలకు పోసాని కృష్ణ మురళి దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన ఆయన ఆ తరువాత పలు స్టార్ హీరోల చిత్రాలకు రైటర్ గా మారారు. 2011లో గోపీచంద్ హీరోగా నటించిన “వాంటెడ్” చిత్రంతో దర్శకుడిగా టర్న్ తీసుకున్నారు. లో బడ్జెట్ తో విజువల్ గా టెక్నికల్ గా అద్భుతంగా తెరకెక్కిన “సెకండ్ హ్యాండ్” చిత్రంతో నిర్మాతగా మారారు.