Bobby Kolli : సింగిల్ టేక్ లో బాలకృష్ణ నటన చూసి 400 మంది చప్పట్లు కొడుతూనే ఉన్నారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డాకు మహారాజ్’. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ‘డాకు మహారాజ్’ను నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. ‘డాకు మహారాజ్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను సొంతం చేసుకున్న ఈ సినిమా భారీ వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే రూ.114 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, బాలకృష్ణ కెరీర్ లోనే అతి పెద్ద విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ లో విజయోత్సవ సభను నిర్వహించిన చిత్ర బృందం, డాకు మహారాజ్ సినిమాకి ఇంతటి విజయాన్ని అందించిన అభిమానులకు, ప్రేక్షకులను కృతజ్ఞతలు తెలిపింది. ఈ క్రమంలో దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ, “బాలకృష్ణ ఫిల్మోగ్రఫీలో గుర్తుండిపోయే సినిమాలలో ఒకటిగా నిలవాలనే ఉద్దేశంతో ‘డాకు మహారాజ్’ను మొదలుపెట్టాము. డిస్ట్రిబ్యూటర్లు అందరికీ మూడు రోజుల్లోనే డబ్బులు వచ్చేసి హ్యాపీగా ఉన్నారు. ఒక దర్శకుడిగా ఇంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. బ్లాక్ బస్టర్లు చాలా వస్తాయి. కానీ రెస్పెక్ట్ అరుదుగా వస్తుంది. ‘డాకు మహారాజ్’ సినిమా చూసి ఎందరో నాకు మాస్టర్ పీస్ అని మెసేజ్ లు పెడుతున్నారు. బాలకృష్ణ ఫిల్మోగ్రఫీలో ఒక మాస్టర్ పీస్ సినిమా ఇవ్వడానికి కారణమైన మా టీం అందరికీ థాంక్యూ సో మచ్.
Daku Maharaj : ఈ నెల 22న ‘డాకు మహారాజ్’ సక్సెస్ ఈవెంట్.. ఎక్కడో తెలుసా?
Also Read
- OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
- Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
- Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
- Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
నా రైటింగ్ టీం చక్రి, మోహన్ కృష్ణ గారు, వినీత్, నందు, భాను ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. బాలకృష్ణ గారికి బెస్ట్ ఫిల్మ్ ఇస్తానని వంశీ గారికి ముందే ప్రామిస్ చేశాను. బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ లు తీయాలి, బెస్ట్ బాలకృష్ణ గారిని చూపించాలి అనుకున్నాను. దర్శకుడిని బాలకృష్ణ గారు ఎంతో నమ్ముతారు. పాత్రలో పరకాయప్రవేశం చేస్తారు. జైపూర్ సింగల్ టేక్ లో బాలకృష్ణ గారు చేసిన నటన చూసి, అక్కడున్న 400 మంది చప్పట్లు కొడుతూనే ఉన్నారు. ఆయన కథను అర్థం చేసుకొని, దర్శకుడు ఏది అడిగితే అది చేస్తారు. బాలకృష్ణ గారికి సినిమా గురించి, లైటింగ్ గురించి ఎంతో నాలెడ్జ్ ఉంటుంది. డీఓపీ విజయ్ కార్తీక్, ఫియట్ మాస్టర్ వెంకట్, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ గారు తమ బెస్ట్ ఇచ్చారు. మా వెనకాల నిలబడి మమ్మల్ని బ్లెస్ చేసిన చినబాబు గారికి స్పెషల్ థాంక్స్. కథకు కీలకమైన నందిని పాత్రకు శ్రద్ధా శ్రీనాథ్ ప్రాణం పోశారు. నిడివితో సంబంధం లేకుండా పాత్రను నమ్మి ఈ సినిమా చేసిన ప్రగ్యా జైస్వాల్ కి థాంక్యూ. వేదకు చాలా టాలెంట్ ఉంది. అనంత శ్రీరామ్ గారు రాసిన ‘చుక్క నీరే’ సాంగ్ సినిమాకి ఎంతో గౌరవం తీసుకొచ్చింది. కాసర్ల శ్యామ్ గారు రాసిన దబిడి దబిడి సాంగ్ కి థియేటర్లలో అద్భుతమైన స్పందన లభిస్తోంది. సినిమా ఎక్కడా బోర్ లేదు, ప్రతి సీన్ ఆసక్తికరంగా ఉంది అనే పేరు రావడానికి ఎడిటర్స్ నిరంజన్, రూబెన్ ప్రధాన కారణం. థమన్ గారు ప్రాణం పెట్టి సంగీతం అందించారు. అభిమానులు నందమూరి థమన్ అని ప్రేమగా పిలుస్తున్నారు అంటే, అది నీ కష్టానికి దక్కిన ఫలితం. నా డైరెక్షన్ టీంకి, సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతఙ్ఞతలు.” అన్నారు.
తాజావార్తలు
-
OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
-
Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!