అనుదీప్ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించిన సినిమా ‘జాతి రత్నాలు’. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా నటించిన ఈ సినిమా మార్చి 11న విడుదలై ప్రపంచ వ్యాప్తంగా హాస్యప్రియుల మన్ననలు పొందింది. ప్రస్తుతం డిజిటల్ మీడియాలోనూ సందడి చేస్తూ ప్రముఖులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమాను ఇండియన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ చూశాడు. ట్విటర్ లో సినిమాపై అభినందనజల్లులు కురిపించాడు. ప్రతి సన్నివేశానికి నవ్వు ఆపుకోలేక పోయానంటూ అద్భుతమైన డైలాగ్స్, అవుట్ స్టాండింగ్ డైరెక్షన్, నటీనటుల ఇన్ క్రెడిబుల్ పెర్ఫార్మెన్స్ అంటూ ఆకాశానికెత్తేశాడు. నిజానికి చాల కస్టమైన జానర్ కామెడీ… దాంట్లోనే చించేశారు. అవుస్టాండింగ్ అంటూ తన ట్వీట్స్ తో యూనిట్ ని మెస్మరైజ్ చేశాడు దినేశ్ కార్తీక్.
‘జాతి రత్నాలు’కు దినేశ్ కార్తీక్ ప్రశంసలు
