NTV Telugu Site icon

Dil Raju: రూపాయి టికెట్ తో సినిమాలు చూసేవాళ్ళం!

Pawan Dil Raju

Pawan Dil Raju

వెంకటేష్, అనిల్ రావిపూడి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదలైన మూడు పాటలు చార్ట్ బస్టర్స్ గా మారడంతో థియేట్రికల్ ట్రైలర్ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు ఈ సినిమా ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు లాంచ్ చేశారు. నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్ లో భారీగా తరలివచ్చిన అభిమానులు, ప్రేక్షకులు సమక్షంలో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ గ్రాండ్ ఈవెంట్ లో హీరో వెంకటేష్ స్టేజ్ పై డ్యాన్స్ చేయడం అభిమానులు ఉర్రూతలూగించింది. అనంతరం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నిజామాబాద్ లో ఇంతకు ముందు ఫిదా వేడుక చేశాం. అనిల్ నిజామాబాద్ లో వేడుక చేద్దామని అన్నారు. వెంకటేష్ గారు అనిల్ శిరీష్ వారి భుజాన వేసుకొని 72 రోజుల్లో ఇంత పెద్ద సినిమాని ఫినిష్ చేశారు. పూర్తిస్థాయిలో ఓ సినిమా వేడుక నిజామాబాద్ లో జరగడం ఇదే ఫస్ట్ టైం.

PM Modi: ప్రధాని మోడీతో సత్య నాదెళ్ల భేటీ

సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. 1980లో ఇక్కడ రూపాయి టికెట్ తో నేను శిరీష్ సినిమాలు చూసేవాళ్ళం. అలా సినిమాలపై ఇష్టం ఏర్పడింది. మా 58వ సినిమా ఈవెంట్ ఇక్కడ చేయడం మాకు చాలా గర్వంగా వుంది. ఎంతోమంది హీరోలు, దర్శకులు సపోర్ట్ చేస్తే ఈ స్థాయిలో వున్నాం. అనిల్ మా బ్యానర్ లో ఆరు సినిమాలు చేసి ఒక పిల్లర్ లా నిలబడ్డారు. తను ఒకొక్కమెట్టు ఎదుగుతూ టాప్ డైరెక్టర్ గా అయ్యారు. ఈ ఏడాది మా సంస్థకు బ్లాక్ బస్టర్ పొంగల్ ఇయర్. పాన్ ఇండియా సినిమా గేమ్ చెంజర్ 10న రిలీజ్ అవుతుంది. మా బ్యానర్ లో ఎఫ్ 2 ఎఫ్ 3 లాంటి సూపర్ హిట్స్ చేసిన వెంకటేష్ గారి సంక్రాంతి వస్తున్నాం సినిమా జనవరి 14న వస్తోంది. అలాగే డాకు మహారాజ్ ని నైజంలో మేము రిలీజ్ చేస్తున్నాం. అందుకే ఇది మాకు బ్లాక్ బస్టర్ పొంగల్. ఐశ్వర్య రాజేష్ సహజంగా నటించింది. ఆ పాత్ర చాలా నచ్చుతుంది.

మీనాక్షి పోలీస్ క్యారెక్టర్ అలరిస్తుంది. రామానాయుడు గారు నిర్మాతగా చరిత్ర సృష్టించారు. వెంకటేష్ గారి కలియుగ పాండవులు ఫోటో చూసి ఆయనకి ఫ్యాన్ అయ్యాను. సినిమా ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి కనెక్ట్ అయ్యాను. వారిద్దరూ నా అభిమాన హీరోలు. వెంకటేష్ గారు వుంటే నిర్మాత సెట్ లో ఉండాల్సిన అవసరం లేదు. ఆయనే అన్నీ జాగ్రత్తగా చూసుకుంటారు. మా బ్యానర్ లో నాలుగు సినిమాలు చేసిన హీరో వెంకటేష్ గారు. నిర్మాతని ప్రేమగా చూసుకునే హీరో ఆయన. వెంకటేష్ గారికి థాంక్ యు సో మచ్. అనిల్ అద్భుతంగా సినిమా తీశాడు. సినిమా పక్కా బ్లాక్ బస్టర్ హిట్. పాటలు ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయ్యాయి. అన్నీ పేర్చుకొని సంక్రాంతికి ఒక బ్లాక్ బస్టర్ హిట్ తీసుకురాబోతున్నాడు అనిల్. సినిమాలో పని చేసిన అందరికీ థాంక్ యూ వెరీ మచ్’ అన్నారు.

Show comments