NTV Telugu Site icon

Dil Raju: తెలంగాణ రాష్ట్రం అవార్డ్స్.. అందరూ సపోర్ట్ చేయండి !

Dilraju

Dilraju

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు వెల్లడించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన అయన ఈ మేరకు ఒక కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది అని అన్నారు. నియమనిబంధనలు ఫ్రేమ్ చేశామన్న ఆయన 2024కు సంబంధించి అవార్డ్స్ ఇస్తామని అన్నారు. గద్దర్ అవార్డ్స్ మాత్రమే కాకుండా పైడి జయరాజ్, కాంతారావు పేరుతో అవార్డ్స్ కూడా ఇస్తామని దిల్ రాజు అన్నారు. ఉర్దూ సినిమాలను ప్రోత్సహించాలని ఒక అవార్డు ఇవ్వబోతున్నాం, 2014 జూన్ నుంచి 2023 వరకు రిలీజ్ అయిన బెస్ట్ సినిమాలకు అవార్డ్ ఇస్తామని దిల్ రాజు పేర్కొన్నారు.

Sreeleela: బాలీవుడ్ హీరోతో శ్రీ లీల డేటింగ్ వెనుక అసలు కథ ఇదా?

గతంలో ఇచ్చిన మాదిరిగానే ఇప్పుడు అవార్డ్ ఇస్తాం.. ఒకట్రెండు మార్పులు చేశామని అన్నారు. ఏప్రిల్ లో అవార్డ్స్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్న దిల్ రాజు 2014 నుంచి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సింహా అవార్డ్స్ కోసం కొందరు చెల్లించిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అవార్డ్స్ వస్తున్నాయి కాబట్టి అందరూ సపోర్ట్ చేయాలని ఆయన అన్నారు. ఇక త్వరలో జ్యూరీ కమిటీ ఏర్పాటు చేస్తామని దిల్ రాజు అన్నారు.