NTV Telugu Site icon

Dil Raju : సరిపోదా శనివారం పై దిల్ రాజు సూపర్ కాన్ఫిడెంట్.. హిట్టు కొట్టేనా..?

Untitled Design (5)

Untitled Design (5)

నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో SJ సూర్య పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్నారు.ఈ అడ్రినలిన్‌ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌ ఇప్పటికే ప్రతి ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది.

Also Read: Dil Raju : ఎట్టకేలకు దిల్ రాజు చేతికి ఒక సినిమా వచ్చింది.. కానీ..?

ఆర్ఆర్ఆర్ తర్వాత దానయ్య గారి బ్యానర్ నుంచి వస్తున్న ఈ సినిమా తెలుగు స్టేట్స్ డిస్ట్రిబ్యుషన్ రైట్స్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కొనుగోలు చేసారు. ఈ చిత్రం గురించి దిల్ రాజు మాట్లాడుతూ ” SJ సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాలి. గేమ్ ఛేంజర్ షూటింగ్ లో గ్యాప్ వచ్చినప్పుడల్లా ఎక్కువగా ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు. ట్రైలర్ చూసి నాని, దానయ్య గారు, డైరెక్టర్ వివేక్ కి ఫోన్ చేశా. వివేక్ చాలా సర్ ప్రైజ్ చేశాడు. అంతకుముందు సినిమాలని సాఫ్ట్ గా తీశాడు. ఈ సినిమాని ఇరగదీశాడు. నాని గారితో మేము చేసిన ఎంసిఏ పెద్ద హిట్టు. దాన్ని దసరా బీట్ చేసింది. దసరాని సరిపోదా శనివారం బీట్ చేయబోతోందని ట్రైలర్ చూసి కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. ఆగస్ట్ 29న నాని గారికి దసరాని బ్రేక్ చేసే సినిమా రాబోతోంది. ఈ సినిమా విజయం యూనిట్ కి ఎంత అవసరమో సినిమా ఇండస్ట్రీకి కూడా అంత అవసరం. సినిమా పెద్ద హిట్ కావాలి” అన్నారు.

Show comments