NTV Telugu Site icon

Dil Raju: నన్ను నేను నాగ వంశీలో వెతుక్కుంటున్నాను

Dil Raju Comments

Dil Raju Comments

దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న నేపథ్యంలో చిత్ర బృందం విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించింది. చిత్ర బృందంతో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్, హను రాఘవపూడి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, “ముందుగా నాగవంశీకి శుభాకాంక్షలు. ఒకప్పుడు నన్ను నేను ఇప్పుడు వంశీలో వెతుక్కుంటున్నాను. లక్కీ భాస్కర్ సినిమా చూసిన తర్వాత నాకు దర్శకుడు వెంకీ అట్లూరిపై చాలా గౌరవం పెరిగింది.

Venky Atluri: సినిమా మొత్తం ఒకటే షర్ట్, ప్యాంటు ధరించిన డైరెక్టర్

ప్రేమ కథలతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన వెంకీ, సార్ సినిమా నుంచి రూట్ మార్చాడు. ఈ సినిమాలో తను రాసిన డైలాగ్ లకు, క్యారెక్టర్లను హ్యాండిల్ చేసిన విధానానికి హ్యాట్సాఫ్. దుల్కర్ గారి నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. తెలుగులో మూడు సినిమాలు మూడు క్లాసిక్స్. జి.వి. ప్రకాష్ మంచి సంగీతం అందించారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా చక్కగా నటించింది. టీం అందరూ కష్టపడి ఒక క్లాసిక్ సినిమాను ఇచ్చారు. ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ లో రావడం మరింత సంతోషంగా ఉంది. నేను ఒకప్పుడు చిన్న, మీడియం రేంజ్ సినిమాలు కూడా చేస్తూ ఘన విజయాలు సాధించాను. ఇప్పుడు వంశీ అది మెయింటైన్ చేస్తున్నాడు. అందుకే వంశీలో నన్ను నేను వెతుక్కుంటున్నాను అని చెప్పాను.” అన్నారు.

Show comments