NTV Telugu Site icon

Dil Raju: ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ ఉంటేనే వేల్యూ.. తెలియ‌ని భ‌యం స్టార్ట్ అయ్యింది!

Dil Raju Sucess

Dil Raju Sucess

గేమ్ చేంజ‌ర్‌, సంక్రాంతి వ‌స్తున్నాం సినిమాల‌ నిర్మాత దిల్‌రాజు సంక్రాంతి సంద‌ర్బంగా గేమ్ చేంజ‌ర్‌ను జ‌న‌వ‌రి 10న‌, సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాను జ‌న‌వ‌రి 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియా ప్ర‌తినిధుల‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశారు. ఈ క్రమంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ గేమ్ చేంజ‌ర్ నాకెంతో ప్ర‌త్యేక‌మైన సినిమా. మూడున్న‌రేళ్ల ప్ర‌యాణ‌మిది. 2021 ఆగ‌స్ట్‌లో సినిమాను పూజా కార్య‌క్ర‌మాల‌తో స్టార్ట్ చేశాం. ఎన్నో ఆటుపోట్లును చూశాను. నిజం చెప్పాలంటే కోవిడ్ రావ‌టం కంటే ముందే ఈ జ‌ర్నీ ప్రారంభం అయ్యింది. కోవిడ్ ముందు నుంచి అంటే నాలుగున్న‌రేళ్ల నుంచి నా జ‌ర్నీ ఎలా జ‌రుగుతుందా? అని ఎదురు చూస్తున్నాను. కోవిడ్ రాక ముందు, 2020లో సినిమా స్టార్ట్ చేసి, మే 21నే రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశాం. అయితే అదే ఏడాది మార్చిలో కోవిడ్ వ‌చ్చింది. వకీల్ సాబ్ రిజల్ట్ కారణంగా బ్రేక్ కావాల‌నే ఉద్దేశంతో నేను నెల రోజుల పాటు అమెరికా వెళ్లిపోయాను. త‌ర్వాత వారిసు సినిమా చేశాం. త‌మిళంలో సినిమా చేయ‌టంతో త‌మిళంలోనే మంచి పేరొచ్చింది. తెలుగులో రావాల్సినంత గుర్తింపు రాలేదు. త‌ర్వాత బ‌ల‌గం సినిమా చేశాం.

సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. ఆ సినిమాకు కూడా తెలంగాణ నేప‌థ్యంలో చేయ‌టం వ‌ల్ల‌.. తెలంగాణ‌లో వంద‌కు వంద మార్కులు వ‌స్తే, ఇత‌ర చోట్ల 70-80 మార్కులే వ‌చ్చాయి. ఇలాంటి స‌మ‌యంలో న‌న్ను నేను అనాల‌సిస్ చేసుకంటూ వ‌స్తున్నాను. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ త‌ర్వాత మా ఏడేళ్ల మ‌న‌వ‌డు ఆరాంశ్‌ ఫోన్ చేసి తాత నువ్వు డిస‌ప్పాయింట్ అవ‌కు, నీ చేతిలో గేమ్ చేంజ‌ర్ ఉంది.. దాంతో కొడ‌తావ్ అన్నాడు. అది నాకు చాలా ఎమోష‌న‌ల్‌గా అనిపింది. అప్పుడు చేంజ్ తీసుకున్నాను. ఎక్క‌డ ఇన్‌స్పైర్ కావాలి. ఎక్క‌డ ప‌ట్టుకోవాల‌నే టార్గెట్ స్టార్ట్ అయ్యింది. స‌న్నిహితులు, శ్రేయోభిలాషులతో మాట్లాడే క్ర‌మంలో అనుకున్న రిజ‌ల్ట్‌తో సినిమాలు రావ‌టం లేద‌ని అన్నారు. దాంతో నాలో తెలియ‌ని భ‌యం స్టార్ట్ అయ్యింది. స్టోరీ జ‌డ్జ్‌మెంట్ పోయిందా? మ‌ళ్లీ కాంబినేష‌న్‌ల‌కే వెళ్లాలా? అని ఆలోచించ‌టం మొద‌లు పెట్టాను. శిరీష్‌గారైతే ఓవ‌ర్‌లోడ్ కార‌ణంగా కాన్‌స‌న్‌ట్రేష‌న్ చేయ‌లేక‌పోతున్నాన‌ని కూడా అన్నారు. దాంతో వ‌ర్క్‌నంతా స్ట్రీమ్‌లైన్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను. సినీ ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ ఉంటేనే వేల్యూ ఉంటుందని దిల్ రాజు అన్నారు.

Show comments